ఆశలు వదలకండి, 100 వారాలు, నెలలు గడిచినా మీ ఆందోళనకు మా మద్దతు, ప్రియాంక గాంధీ

| Edited By: Anil kumar poka

Mar 07, 2021 | 7:38 PM

రైతు చట్టాల రద్దును కోరుతూ అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రకటించారు. 100 వారాలు, 100 నెలలు అయినా సరే.. మా పార్టీ మద్దతు మీకు కొనసాగుతూనే ఉంటుంది అని ఆమె అన్నారు.

ఆశలు వదలకండి, 100 వారాలు, నెలలు గడిచినా మీ ఆందోళనకు మా మద్దతు, ప్రియాంక గాంధీ
Follow us on

రైతు చట్టాల రద్దును కోరుతూ అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రకటించారు. 100 వారాలు, 100 నెలలు అయినా సరే.. మా పార్టీ మద్దతు మీకు కొనసాగుతూనే ఉంటుంది అని ఆమె అన్నారు. ఆదివారం  పశ్చిమ యూపీలోని మీరట్ లో జరిగిన మహా పంచాయత్ లో మాట్లాడిన ఆమె..రైతులు తమ ఆశలను వీడరాదని, మేము  మీకు అండగా ఉంటామని హామీ ఇఛ్చారు.  ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ పాల్గొన్న మహాపంచాయత్ లలో ఇది ఐదవది. తూర్పు యూపీలో త్వరలో జరిగే మహాపంచాయత్ లో ఆమె మళ్ళీ పాల్గొననున్నారు .కాగా-ముజఫర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో రైతు  నేత రాకేష్ తికాయత్ మాట్లాడుతూ.. అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల ద్వారా సాగుతుందని, ఈ నెల 27 న ఘాజీపూర్ చేరుకుంటుందని తెలిపారు. మరోవైపు ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీలోని బోర్డర్ పాయింట్లలో రైతు శిబిరాలను మరింత ‘అధునాతనం’ చేయనున్నారు,. శాశ్వతంగా ఏసీలను, ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్నదాతల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. తాము పిలిచిన గంటలోగా  లక్ష మందికి పైగా రైతులు ఇక్కడ చేరుతారని రాకేష్ తికాయత్ పునరుద్ఘటించారు.

ప్రస్తుతం అనేకమంది తమ పంట పనులకోసం గ్రామాలకు వెళ్లారని, కానీ వీరంతా ఇక్కడికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదన్నారు.   నిరసన కొనసాగడానికి అనువుగా వారిని  షిఫ్తుల ప్రకారం నిరసన శిబిరాల్లో నియోగిస్తామని, ప్రతి 15 మంది తరువాత మరో 15 మంది రైతులు వారి స్థానంలో  వస్తారని ఆయన చెప్పారు. తమ ఆందోళనను  విరమించామన్న ఊహాగానాలను ఆయన ఖండించారు. కేంద్రం వివాదాస్పద చట్టాలను రద్దు చేసేంతవరకు మా నిరసన కొనసాగుతుంది అన్నారు. తమకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదని ఆయన చెప్పినప్పటికీ… యూపీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహాపంచాయత్ కి వేలాది రైతులు తరలి వచ్చారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

కారుణ్య నియామకాలకు పెళ్లైన మహిళలు అర్హులే.. తల్లిదండ్రుల విషయంలో సమాన హక్కులు, విధులు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..

Gaali Sampath: గాలీ సంపత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో