Etela in Delhi : ఢిల్లీ చేరుకున్న ఈటెల బృందం.. రెండు రోజుల పర్యటనలో బిజెపి అగ్రనేతలను కలిసే అవకాశం.! లైట్ తీసుకున్న టీఆర్ఎస్

|

May 30, 2021 | 9:57 PM

కాగా, ఈటల ఢిల్లీ పర్యటనను అధికార తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే లైట్ తీసుకుంది..

Etela in Delhi : ఢిల్లీ చేరుకున్న ఈటెల బృందం.. రెండు రోజుల పర్యటనలో  బిజెపి అగ్రనేతలను కలిసే అవకాశం.!  లైట్ తీసుకున్న టీఆర్ఎస్
Etela In Delhi
Follow us on

Etela Rajender two days Delhi tour : కేసీఆర్ మంత్రి వర్గం నుంచి అవినీతి ఆరోపణలతో బహిష్కరణకు గురైన ఈటల రాజేందర్ భవిష్యత్ రాజకీయం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈటల హస్తినలో బిజెపి అగ్రనేతలను కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈటెల తోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, బిజెపి నేత జి వివేక్ వెంకటస్వామి కూడా రాజేందర్ వెంట ఢిల్లీకి వెళ్లారు. ఇలాఉండగా, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరతారంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్లడం మరింత ఊతమిస్తోంది. బిజెపిలో చేరికపై ఆ పార్టీ అగ్ర నేతలతో మంతనాలు జరిపేందుకే ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఈటల ఢిల్లీ పర్యటనను అధికార తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే లైట్ తీసుకుంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారన్న విషయంపై తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈటల ఢిల్లీ వెళ్లినా ఒరిగేదేమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈటల బిజెపిలోకి వెళ్తే ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చన్న జగదీశ్‌రెడ్డి.. ఆయన వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని కూడా తేల్చిచెప్పేశారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభ తగ్గుతోందని ఆయన అన్నారు. అయినా.. బిజెపికి తెలంగాణలో బలం లేదంటూ జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అక్రమ రాజకీయ నేతలు కుప్పిగంతులు వేయడం సహజమంటూ జగదీశ్ రెడ్డి పరోక్షంగా ఈటలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Read also : Helping Hands : కొత్వాల్ శ్రీనివాస్ కుటుంబ పరిస్థితి తెల్సుకొని చలించిపోయిన మంత్రి హరీశ్ రావు.. యుద్ధ ప్రాతిపదికన ఏంచేశారంటే. .!