ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ స్క్వాష్ పిటిషన్‌పై ఇవాళ తెలంగాణా హైకోర్టులో విచారణకు రానుంది. గత వారం రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన ఐటీ గ్రిడ్ డేటా కేసులో ప్రధాన నిందితునిగా పేర్కొంటున్న అశోక్ తెలంగాణా పోలీసులకు చిక్కుండా తప్పించుకుంటున్నారు. దాంతో అశోక్‌ను పట్టుకునేందుకు తెలంగాణా సిట్ లుక్ అవుట్ నోటీసులతో వెతుకులాట ప్రారంభించింది. దాంతో అప్రమత్తమైన అశోక్.. తనతో పాటు తన కంపెనీలపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది.
రెండు రోజుల పాటు మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన తెలంగాణ సిట్, చివరికి కీలక డాక్యుమెంట్లను స్వాధీన పరుచుకుని, కార్యాలయాన్ని సీజ్ చేసింది. సిట్కు సారథ్యం వహిస్తున్న ఐసీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు అశోక్ కోసం గతంలోనే హైకోర్టులో హెబియస్ పటిషన్ దాకు చేశాడు. ఈ నేపథ్యంలో తనతో పాటు, తన సంస్థలపై దాఖలైన కేసులన్నింటినీ తోసి పుచ్చాలంటూ అశోక్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుంది. కేసు పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.