గంభీర్‌కు రెండు చోట్ల ఓట్లున్నాయి : ఆప్ అభ్యర్ధి

తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్రికెటర్ గౌతం గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ అతిషి ఈసీకి ఫిర్యాదు చేసింది. గంభీర్ రెండు ఓట్లు కలిగివున్నందున ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఆప్ విజ్ఞప్తి చేసింది. గంభీర్‌కు సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గంలోని రాజేంద్రనగర్‌తోపాటు కరోల్‌బాగ్‌లో కూడా ఓటు ఉందని ఆరోపించారు. కాగా అనర్హతకు గురయ్యే బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి తమ ఓటును వృథా చేసుకోవద్దని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు […]

గంభీర్‌కు రెండు చోట్ల ఓట్లున్నాయి : ఆప్ అభ్యర్ధి

Edited By:

Updated on: Apr 27, 2019 | 7:28 AM

తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్రికెటర్ గౌతం గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ అతిషి ఈసీకి ఫిర్యాదు చేసింది. గంభీర్ రెండు ఓట్లు కలిగివున్నందున ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఆప్ విజ్ఞప్తి చేసింది. గంభీర్‌కు సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గంలోని రాజేంద్రనగర్‌తోపాటు కరోల్‌బాగ్‌లో కూడా ఓటు ఉందని ఆరోపించారు. కాగా అనర్హతకు గురయ్యే బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి తమ ఓటును వృథా చేసుకోవద్దని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. అయితే ఆప్ చేస్తున్న ఆరోపణలను గౌతం గంభీర్ ఖండించారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోతుందన్న భయంతో ఇలాంటి ఆరోపణలకు దిగజారిందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ విమర్శించారు.