నిరుద్యోగ భృతిని పెంచకండి: ఎన్నికల సంఘం

| Edited By:

Mar 30, 2019 | 9:08 AM

ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఏపీలో నిరుద్యోగులకు ఇస్తున్న నిరుద్యోగ భృతిని రూ.2 వేలకు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు భృతిని పెంచరాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ అందింది. కాగా నిరుద్యోగ భృతి మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.2వేలకు పెంచేందుకు అనుమతిని ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. […]

నిరుద్యోగ భృతిని పెంచకండి: ఎన్నికల సంఘం
Follow us on

ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఏపీలో నిరుద్యోగులకు ఇస్తున్న నిరుద్యోగ భృతిని రూ.2 వేలకు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు భృతిని పెంచరాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ అందింది.

కాగా నిరుద్యోగ భృతి మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.2వేలకు పెంచేందుకు అనుమతిని ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. దీనిపై స్పందించిన ఈసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున భృతిని పెంచకండి అంటూ పేర్కొంది. అయితే సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ల నియామకం, రాష్ట్ర సమాచార కమిషనర్‌ నియామకం, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వంటి ప్రతిపాదనలకు మాత్రం ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.