
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. గురువారం జరిగే పోలింగ్ కోసం ఇప్పటికే ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది. గడువు తరువాత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం అన్ని పార్టీల అభ్యర్థులను ముందే హెచ్చరించింది.
దీంతో.. అన్ని పార్టీలు చివరి గంటల్లో ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాల్లో జరిగే ఆఖరివిడత ప్రచారంలో పాల్గొంటున్నారు. గురజాల, సత్తెనపల్లి, తాడికొండలో టీడీపీ అభ్యర్థుల తరుపున బాబు ప్రచారం చేస్తారు. పోలింగ్‌కు ఒకే రోజు గడువు ఉండడంతో బూత్ మేనేజ్‌మెంట్‌పై చాలా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పార్టీ కేడర్‌కు సూచించారు.
అలాగే.. వైసీపీ అధినేత జగన్ కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. ఆఖరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల్లో జరిగే సభల్లో పాల్గొంటున్నారు. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఇవాళ ప్రచారం చేస్తున్నారు. కర్నూలు, తిరుపతిలో కూడా వైసీపీ అభ్యర్థుల తరపున జగన్ ప్రచారం చేస్తారు.
తెలంగాణాలో కూడా ఎన్నికల ప్రచారం వేడెక్కింది. 17 లోక్‌సభ స్థానాలకు జరిగే పోలింగ్‌కు ప్రచారం నేటి సాయంత్రంకు పరిసమాప్తం కానుంది. దీంతో.. ప్రచారంలో దూకుడు పెంచారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్గొండలో జరిగే భారీ రోడ్‌షోలో పాల్గొననున్నారు. అలాగే.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇవాళ శంషాబాద్‌లో జరిగే ఎన్నికల సభలో పాల్గొంటారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి జనార్థన్‌రెడ్డి తరపున ప్రచారం చేస్తారు.