మిషన్ శక్తి ప్రసంగంపై ప్రధాని మోదీకి ఊరట.. క్లీన్ చిట్ ఇచ్చిన ఈసీ

| Edited By:

Mar 29, 2019 | 2:01 PM

న్యూఢిల్లీ : ప్రధాని మోదీకి ఈసీ ఊరట కల్పించింది. ఇటీవల ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విపక్షాల ఫిర్యాదుతో.. ప్రధాని మోదీ యాంటీ శాటిలైట్ మిసైల్ పరీక్ష విజయవంతమైందంటూ చేసిన ప్రసంగంపై ఓ కమిటీని వేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన చేసిన ప్రసంగంలో ఎలాంటి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగలేదని ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడ […]

మిషన్ శక్తి ప్రసంగంపై ప్రధాని మోదీకి ఊరట.. క్లీన్ చిట్ ఇచ్చిన ఈసీ
Follow us on

న్యూఢిల్లీ : ప్రధాని మోదీకి ఈసీ ఊరట కల్పించింది. ఇటీవల ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విపక్షాల ఫిర్యాదుతో.. ప్రధాని మోదీ యాంటీ శాటిలైట్ మిసైల్ పరీక్ష విజయవంతమైందంటూ చేసిన ప్రసంగంపై ఓ కమిటీని వేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన చేసిన ప్రసంగంలో ఎలాంటి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగలేదని ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడ కూడా బీజేపీ గురించిగాని, తమ పార్టీకి ఓటేయాలని గాని ప్రస్తావించలేదని తేల్చిచెప్పారు. అయితే ప్రధాని మోదీ.. ఇదేదో తమ ప్రభుత్వ విజయంగా హైలెట్ చేశారని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అత్యవసర అంశం కాదని విపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగాన్ని పరిశీలించేందుకు డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ సారథ్యంలో ఒక ప్యానల్‌ను ఎన్నికల సంఘం బుధవారంనాడు ఏర్పాటు చేసింది. అనంతరం ప్రధాని ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఈసీ.. ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది.