జేసీకి క్లీన్‌ చిట్‌.. నో ప్రాబ్లమ్

| Edited By: Srinu

May 19, 2019 | 4:51 PM

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇటీవల ఎన్నికల్లో అనంతపురంలో పార్టీలన్నీ రూ.50 కోట్లు ఖర్చుచేశాయని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నేతల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రిటర్నింగ్ అధికారి.. జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని నివేదిక సమర్పించారు. ప్రస్తుతం ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోయిందని, అన్ని పార్టీలు రూ. 10వేల కోట్లు ఖర్చు చేశాయని, పోటీలు పడి పార్టీలు […]

జేసీకి క్లీన్‌ చిట్‌..  నో ప్రాబ్లమ్
Follow us on

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇటీవల ఎన్నికల్లో అనంతపురంలో పార్టీలన్నీ రూ.50 కోట్లు ఖర్చుచేశాయని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నేతల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రిటర్నింగ్ అధికారి.. జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని నివేదిక సమర్పించారు.

ప్రస్తుతం ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోయిందని, అన్ని పార్టీలు రూ. 10వేల కోట్లు ఖర్చు చేశాయని, పోటీలు పడి పార్టీలు ఖర్చు పెట్టాయని, మొదట్లో పోటీకి రూ. లక్ష, రెండోసారి రూ. 25 లక్షలు, ఇప్పుడు రూ. 25 కోట్లు లేకుంటే పోటీ చేసే పరిస్థితి లేదని.. అన్ని పార్టీలనుద్దేశించి జేసీ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఎన్నికల్లో తాను రూ. 50 కోట్లు ఖర్చు చేశానని ఎక్కడా చెప్పలేదని ఆర్వోకి వివరణ ఇచ్చారు. అయితే జేసీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఎవరి పేరును నేరుగా ప్రస్తావించలేదని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పరిధిలోకి రాదని ఆర్వో తన నివేదికలో స్పష్టం చేశారు.