Etela Rajender: అయన గెలుపుతో బీజేపీకి ఊపు వచ్చింది. కానీ అయన చేస్తున్న పనులు హైకమాండ్‌కు చికాకు తెప్పిస్తున్నాయి. పార్టీ ఎజెండాను మాత్రమే ముందుంచే కమలం పార్టీలో సొంత ఎజెండాతో ముందుకుపోతూ కొరకరానికొయ్యగా మారుతున్నారు. పార్టీ శ్రేణుల్లోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో అందరిదీ ఒకదారి అయితే ఆననది మరోదారి.! నా రూటే సపరేటు అంటూ సింగిల్‌గా దూసుకెళ్తున్నారట ఈటల. హుజురాబాద్ బైపోల్‌లో ఘనవిజయం తర్వాత సొంతరాగం అందుకుంటున్నారు. విజయం తర్వాత ఇది బీజేపీ గెలుపు కాదు..తన వ్యక్తిగత విజయం అంటూ అక్కడక్కడ చేసిన కామెంట్స్‌ను నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గెలుపుకోసం పార్టీ త్రీవంగా కృషి చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంటనే భావనలో అప్పట్లో వ్యక్తమైంది. అయినా చూసీచూడనట్లుగా వదిలేశారు. అయితే ఈ మధ్య ఈటల అమలుచేస్తోన్న సొంత ఎజెండాను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని తెలుస్తోంది.
ఇటీవలి స్థానిక సంస్థల ఎంఎల్‌సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రకటించారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే అన్ని ఎలక్షన్లలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ఇప్పటికే టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్నందున.. ఈ ఎంఎల్‌సీ ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని రాష్ట్ర నాయకత్వం భావించింది. అందుకే పోటీకి దూరంగా ఉంది. కానీ ఈటల మాత్రం కరీంనగర్‌లో రవీందర్ సింగ్‌కు మద్దతు ఇస్తున్నామని…ఆదిలాబాద్‌లో క్యాండిడెట్‌నూ తానే పెట్టించానని ప్రకటించారు.. ఈ ఇష్యూపై పార్టీ చాలా సీరియస్‌గా ఉందట. ఏకపక్షంగా ఇలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని సీనియర్లంతా తప్పుపడుతున్నారట..
బీజేపీ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాల్లోనూ ఈటల సొంత ఆహ్వానాలతోనే పర్యటిస్తున్నారనే భావన కూడా పార్టీ నాయకత్వంలో ఉందట. సమావేశాలకు వెళ్లడమే కాకుండా.. అక్కడ తన సామాజికవర్గానికి చేందిన కులసంఘాలతో సన్మానాలు చేయించుకుంటూ పార్టీ కార్యక్రమాలకూ ఇబ్బంది కలిగిస్తున్నారని భావిస్తున్నారు.. ఈటల తీరుపై రాష్ట్ర నాయకత్వ సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం. సొంత ఎజెండాతో వెళ్లే నేతలకు ఇబ్బందులు తప్పవంటూ అందరికీ ఓ హెచ్చరిక పంపాలని యోచిస్తోందట. మరి ఈటల ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం.
ఇవి కూడా చదవండి: Aryan Khan: ఆర్యన్ ఖాన్‌కు మరింత ఊరట.. ఆ అవసరం లేదన్న బాంబే హైకోర్టు..
Cow: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన గోమాత.. రైతు ఇంట్లో పండుగ శోభ..