ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌కు సెక్యూరిటీ తగ్గింపు… వెంటనే పునరుద్ధరించాలన్న కాంగ్రెస్ నేత

| Edited By:

Apr 02, 2019 | 9:28 PM

బీజేపీకి అనుబంధంగా ఉండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆఫీస్‌కు సెక్యూరిటీ తగ్గిస్తే.. ఫస్ట్ రియాక్షన్ బీజేపీ నాయకుల నుంచే వస్తుందని మోజార్టీ ప్రజలు భావిస్తుంటారు. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య ఉండే సంబంధాల గురించి తెలిసినవారెవరైనా… ఈ రకంగానే ఆలోచిస్తారు. కానీ… మధ్యప్రదేశ్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా జరగింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గించారనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ తీవ్ర […]

ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌కు సెక్యూరిటీ తగ్గింపు... వెంటనే పునరుద్ధరించాలన్న కాంగ్రెస్ నేత
Follow us on

బీజేపీకి అనుబంధంగా ఉండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆఫీస్‌కు సెక్యూరిటీ తగ్గిస్తే.. ఫస్ట్ రియాక్షన్ బీజేపీ నాయకుల నుంచే వస్తుందని మోజార్టీ ప్రజలు భావిస్తుంటారు. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య ఉండే సంబంధాల గురించి తెలిసినవారెవరైనా… ఈ రకంగానే ఆలోచిస్తారు. కానీ… మధ్యప్రదేశ్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా జరగింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గించారనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే భద్రతను మళ్లీ పునరుద్ధరించాలని ట్విట్టర్ ద్వారా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కోరారు.

అయితే ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ… ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గిస్తే దిగ్విజయ్ సింగ్‌కు అంత ఉలికిపాటు ఎందుకని విమర్శించింది. 30 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉంటున్న భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దిగ్విజయ్ సింగ్ బరిలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గింపు అంశం బీజేపీకి రాజకీయంగా కలిసొస్తుందనే భావనతోనే దిగ్విజయ్ సింగ్ వెంటనే స్పందించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా… ఆర్ఎస్ఎస్‌ను విమర్శించే కాంగ్రెస్ నేతల్లో ముందు వరుసలో ఉండే దిగ్విజయ్ సింగ్.. ఆ సంస్థ ఆఫీసుకు సెక్యూరిటీని పునరుద్ధరించాలని కోరడం నిజంగా విశేషమనే చెప్పాలి.