ప్రకృతి వైద్యమే బెస్ట్.. రిసార్టుకు తండ్రీ కొడుకులు

| Edited By:

Apr 30, 2019 | 4:51 PM

కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ ప్రకృతి చికిత్స కోసం ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో ఉడుపి జిల్లాకు వెళ్లారు. అక్కడ కాపువిన మూళూరులోని ఓ రిసార్టులో వారు ప్రకృతి వైద్యం చేయించుకోనున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి మరో ఐదు రోజుల అనంతరమే.. బెంగళూరుకు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా లోక్‌సభ ఎన్నికల తరువాత కుమారస్వామి ప్రకృతి వైద్యం నిమిత్తం రిసార్టుకు వెళ్లారు. కానీ కొలంబోలో జరిగిన బాంబు […]

ప్రకృతి వైద్యమే బెస్ట్.. రిసార్టుకు తండ్రీ కొడుకులు
Follow us on

కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ ప్రకృతి చికిత్స కోసం ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో ఉడుపి జిల్లాకు వెళ్లారు. అక్కడ కాపువిన మూళూరులోని ఓ రిసార్టులో వారు ప్రకృతి వైద్యం చేయించుకోనున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి మరో ఐదు రోజుల అనంతరమే.. బెంగళూరుకు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా లోక్‌సభ ఎన్నికల తరువాత కుమారస్వామి ప్రకృతి వైద్యం నిమిత్తం రిసార్టుకు వెళ్లారు. కానీ కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో కొందరు జేడీఎస్ నేతలు మృతి చెందడంతో అర్ధాంతరంగా తిరిగి వచ్చిన ఆయన.. ఇప్పుడు తన తండ్రితో కలిసి మళ్లీ రిసార్టుకు బయలుదేరారు.

మరోవైపు కుమారస్వామి ప్రకృతి వైద్యం కోసం వెళ్లడంపై బీజేపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. రాష్ట్రం మొత్తం కరువుతో అల్లాడుతుంటే సీఎం విశ్రాంతి తీసుకోవడం ఏంటని వారు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలప్పటి నుంచి రాష్ట్రంలో పరిపాలన సరిగా జరగడం లేదని.. పాలనను పక్కన పెట్టి రిసార్టులో విశ్రాంతి తీసుకోవడమేంటని దుయ్యబడుతున్నారు.