అనుకోకుండా జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి వరించింది.! కానీ 2 నెలలు తిరగకుండానే రాజీనామా చేయాల్సి వస్తోంది. మరి ఇచ్చిన మాట ప్రకారం రిజైన్ చేస్తారా? లాస్ట్ మినట్‌లో ట్విస్ట్‌లు కొనసాగుతాయా? కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ వివాదం ఇంట్రెస్టింగ్‌గా మారింది. జడ్పీటీసీ ఎన్నికలకు ముందు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని సీనియర్ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి కి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. కొలిమిగుండ్ల నుంచి జడ్పిటిసి గా ఏకగ్రీవం అయిన ఎర్రబోతుల వెంకటరెడ్డి … ఆ తర్వాత కరోనాతో మృతిచెందారు. అదృష్టవశాత్తూ సంజామల జెడ్ పి టి సి వెంకటసుబ్బారెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వరించింది.
కొలిమిగుండ్ల ఉప ఎన్నికలలో ఎర్రబోతుల వెంకటరెడ్డి కుటుంబం నుంచి జెడ్పీటీసీ గా గెలిచిన తర్వాత రాజీనామా చేయాలని వెంకటసుబ్బారెడ్డికి పార్టీ అప్పట్లోనే సూచించింది. అనుకున్నట్లుగానే ఎర్రబోతుల వెంకటరెడ్డి కుమారుడు పాపిరెడ్డి ఇ కొలిమిగుండ్ల జడ్పిటిసి గా ఏకగ్రీవంగా అయ్యారు. ముందుగా చెప్పిన ప్రకారం… సోమవారం రాజీనామా చేయాలని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి ఆదేశించారు.
సోమవారం వెంకటసుబ్బారెడ్డి రాజీనామా చేస్తారా..? లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై పార్టీ నేతలు ఎవరూ కూడా నోరు మెదపడం లేదు. రాజీనామా చేయాలని వెంకటసుబ్బారెడ్డి చెప్పిన విషయం వాస్తవమే అని ఎమ్మెల్యే రామిరెడ్డి ఫోన్లో తెలిపారు. అయితే వెంకటసుబ్బారెడ్డి మాత్రం ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత రాజీనామా చేయాలని అని అనుకుంటున్నారు.
వైయస్ కుటుంబానికి వెంకటసుబ్బారెడ్డి దగ్గర వ్యక్తి . ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం వెంకటసుబ్బారెడ్డి కోరారు. తనను జడ్పీ చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ కొనసాగిస్తారని.. రాజీనామా చేయమని చెప్పి పక్షంలో.. రాజకీయ భవిష్యత్తు పై ఏదో ఒక హామీ ముఖ్యమంత్రి నుంచి వస్తుందని వెంకటసుబ్బారెడ్డి ఆశిస్తున్నారు. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎన్ని మలుపులు తిరుగుతుందో అనేదానిపై రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది.
ముందుగా చెప్పిన ప్రకారం సోమవారం రాజీనామా చేయాలని వెంకటసుబ్బారెడ్డిని ఆదేశించారు బనగానపల్లె MLA కాటసాని రామిరెడ్డి. మరి ఆయన రాజీనామా చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి: MLC Elections: నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే…!
PM Modi Tribute: ఢిల్లీ చేరుకున్న రావత్ సహా 13 మంది పార్థివదేహాలు.. నివాళులర్పించిన ప్రధాని మోడీ