బీజేపీలోకి కాంగ్రెస్ రెబెల్‌ ఎమ్మెల్యే.. ఖర్గేపై పోటీకి సై

బెంగళూరు: ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యే ఉమేశ్‌ జాదవ్‌ కమలం గూటికి చేరారు. కల్బుర్గిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభ సందర్భంగా బీజేపీ కర్ణాటక చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప, మాజీ సీఎం జగదీశ్‌ షెట్టార్‌, ఇతర పార్టీ నేతల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని, నరేంద్ర మోదీ మళ్లీ దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టేవిధంగా కల్బుర్గి ప్రజలు తనను ఆశీర్వదించాలని […]

బీజేపీలోకి కాంగ్రెస్ రెబెల్‌ ఎమ్మెల్యే.. ఖర్గేపై పోటీకి సై

Edited By:

Updated on: Feb 14, 2020 | 1:51 PM

బెంగళూరు: ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యే ఉమేశ్‌ జాదవ్‌ కమలం గూటికి చేరారు. కల్బుర్గిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభ సందర్భంగా బీజేపీ కర్ణాటక చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప, మాజీ సీఎం జగదీశ్‌ షెట్టార్‌, ఇతర పార్టీ నేతల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని, నరేంద్ర మోదీ మళ్లీ దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టేవిధంగా కల్బుర్గి ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

కర్ణాటకలో ఓటమి ఎరుగని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన ఖర్గేపై బరిలోకి దింపేందుకే ఉమేశ్‌ జాదవ్‌ను బీజేపీ పార్టీలో చేర్చుకున్నట్టు కాషాయ వర్గాలు తెలిపాయి. గుల్బార్గా నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన ఖర్గే ఎన్నికల్లో ఎప్పుడూ ఓడిపోలేదు. ఈసారి ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అందుకే స్థానికంగా గట్టి పట్టున్న కాంగ్రెస్‌ రెబెల్‌ నేత ఉమేశ్‌ జాదవ్‌ను పార్టీలో చేర్చుకున్నట్టు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us