నా పరువు పోయింది.. బీజేపీ ఎమ్మెల్యేపై రూ.204కోట్ల దావా

తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ రూ.204కోట్ల పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చిన ఆయన.. ‘‘జూన్ 23న పాటిల్ నాపై నిరాధార వ్యాఖ్యలు చేశారు. కేసులు నమోదు చేయొద్దంటూ నేను బీజేపీ నాయకులను, కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చినట్లు మాట్లాడారు. ఒకవేళ నాపై కేసులు నమోదుచేయకపోతే సంకీర్ణ కూటమి పతనంలో నేను తటస్థ వైఖరి అనుసరిస్తాను అన్నట్లు చెప్పుకొచ్చారు. […]

నా పరువు పోయింది.. బీజేపీ ఎమ్మెల్యేపై రూ.204కోట్ల దావా

Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 05, 2019 | 9:10 AM

తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ రూ.204కోట్ల పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చిన ఆయన.. ‘‘జూన్ 23న పాటిల్ నాపై నిరాధార వ్యాఖ్యలు చేశారు. కేసులు నమోదు చేయొద్దంటూ నేను బీజేపీ నాయకులను, కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చినట్లు మాట్లాడారు. ఒకవేళ నాపై కేసులు నమోదుచేయకపోతే సంకీర్ణ కూటమి పతనంలో నేను తటస్థ వైఖరి అనుసరిస్తాను అన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల వలన కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో నా విధేయత, చిత్తశుద్ధి దెబ్బతిన్నాయి. నా ప్రతిష్ట దెబ్బతింది. అందుకే ఆయనపై పరువునష్టం దావా కేసు వేశాను’’ అని అన్నారు. కాగా సెప్టెంబర్ 18న రామానగర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది.