మీరే దేశానికి వెలకట్టలేని ఆస్తి.. చిన్నారులకు సీఎం జగన్ బాలల దినోత్సవం శుభాకాంక్షలు

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నారులకు శుభాకాంక్షలకు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేసిన జగన్

మీరే దేశానికి వెలకట్టలేని ఆస్తి.. చిన్నారులకు సీఎం జగన్ బాలల దినోత్సవం శుభాకాంక్షలు

Edited By:

Updated on: Nov 14, 2020 | 10:22 AM

YS Jagan Children’s Day: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నారులకు శుభాకాంక్షలకు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేసిన జగన్‌.. ”చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతిరూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువు ఒక్కటే. అందుకే చిన్నారుల భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు” అని ట్వీట్‌లో తెలిపారు. (మావటితో మాట్లాడుతున్న శ్రీరంగం దేవాలయం ఏనుగు.. వీడియో వైరల్‌.. వావ్ అంటోన్న నెటిజన్లు)

మరోవైపు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు జగన్‌. ”రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని భగవంతున్ని కోరుకుంటున్నా” అని జగన్ ట్వీట్‌ చేశారు. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,050 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,736 మంది)