సాగర్‌ ఉప పోరుపై స్ట్రాటజీ మార్చిన గులాబీ బాస్‌.. ఇంతకీ ఆ ఐదుగురలో అధినేత ఆశీర్వాదం ఎవరికి..?

|

Mar 05, 2021 | 5:33 PM

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు సంబంధించి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్ట్రాటజీ మార్చింది గులాబీ పార్టీ. సిట్టింగ్‌ సీటులో మళ్లీ గెలవాలంటే...

సాగర్‌ ఉప పోరుపై స్ట్రాటజీ మార్చిన గులాబీ బాస్‌.. ఇంతకీ ఆ ఐదుగురలో అధినేత ఆశీర్వాదం ఎవరికి..?
Follow us on

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు సంబంధించి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్ట్రాటజీ మార్చింది గులాబీ పార్టీ. సిట్టింగ్‌ సీటులో మళ్లీ గెలవాలంటే… మార్పు తప్పదనే అంచనాకొచ్చింది. యాక్షన్‌ కూడా మొదలు పెట్టేసింది. ప్రగతి భవన్‌ నుంచి కొందరికి ఫోన్లు సైతం వెళ్లాయి. ఇంతకీ టీఆర్‌ఎస్‌ కొత్త ప్లాన్‌ ఏంటి? ఆ పార్టీ చేయబోయే మార్పు ఏంటనేది గులాబీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఫలితాల నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికను గులాబీ అధినేత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిట్టింగ్‌ సీటును మళ్లీ గెలవాలన్నదే ఆ పార్టీ టార్గెట్‌. దాన్ని రీచ్‌ కావాలంటే ఏం చేయాలనే దానిపై కసరత్తును స్పీడప్‌ చేసింది. ఇప్పటికే మండలాల వారీగా ఇన్‌ఛార్జులను నియమించింది.

సాగర్‌లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌ పాయింట్‌గా మారింది. నోముల నర్సింహయ్య మరణంతో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి… ఆయన కుటుంబంలోని వారికే టిక్కెట్‌ ఇస్తారనేది ఇన్నాళ్లు జరిగిన ప్రచారం. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ మార్చినట్లే కనిపిస్తోంది. నోముల తనయుడు నోముల భగత్‌కు లేదంటే ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డికే టిక్కెట్‌ ఫైనల్‌ అంటూ వార్తలొచ్చాయి. చిన్నపురెడ్డి తన అనుచరుల దగ్గర కూడా చెప్పుకున్నారు. భగత్‌ సైతం టిక్కెట్‌పై భరోసాగా ఉన్నారు. తాజా పరిణామాలతో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. రెండు మూడు రోజుల్లోనే షెడ్యూల్‌ వస్తుందన్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌లో కొత్త ఫేస్‌లు ఎంట్రీ ఇచ్చాయి.

ప్రగతి భవన్‌ నుంచి కొందరికి ఫోన్లు వెళ్లడం సాగర్‌లో కొత్త చర్చకు కారణమైంది. నోముల భగత్‌, తేరా చిన్నపురెడ్డిలకు కాకుండా ముగ్గురు యాదవ నేతలకు కాల్స్‌ వెళ్లాయి. టీఆర్‌ఎస్‌ నేతలు… గురవయ్య యాదవ్‌, రంజిత్‌ యాదవ్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నారు. బీజేపీ నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న కడారి అంజయ్య యాదవ్‌కి కూడా ఫోన్‌ వెళ్లింది. మీ బలం, బలగం ఏంటి, పోటీకి సిద్ధమా… స్ట్రాటజీ ఏంటి… అన్న ప్రశ్నలతో ఈ ముగ్గురికీ కాల్స్‌ వెళ్లడం ఆసక్తిగా మారింది. ఈ ముగ్గురు సంగతి ఏమోకానీ… ఫోన్స్‌ కాల్స్‌తో నోముల కుటుంబంలో టెన్షన్‌ మొదలైనట్లు తెలుస్తోంది. భగత్‌కే టిక్కెట్‌ ఇవ్వడం ఖరారైతే… మళ్లీ ఈ ముగ్గురికీ ఫోన్స్‌ ఎందుకు చేశారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వలేకే… యాదవ సామాజికవర్గంలో వేరే వారిని బరిలోకి దింపాలన్నది అధిష్టానం ఆలోచనగా నేతలు చెబుతున్నారు.

నాగార్జునసాగర్‌లో యాదవ సామాజికవర్గం బలంగా ఉంది. ఒకవేళ భగత్‌కు వద్దనుకుంటే… అదే సామాజికవర్గం వారికి ఇస్తేనే వర్కవుట్‌ అవుతుందనే అంచనాలో ఉంది టీఆర్‌ఎస్‌. కాబట్టే గురవయ్య, రంజిత్‌, అంజయ్య యాదవ్‌లకు ఫోన్స్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. పైగా ఈ మధ్య కాలంలో సాగర్‌లో అభ్యర్థులపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఓ సర్వే చేయించినట్లు సమాచారం. అందులో నోముల భగత్‌కు పెద్దగా పాజిటివ్‌ కనిపించలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు నామినేటెడ్‌ పోస్టు ఇచ్చి… టిక్కెట్‌ మరొకరికి ఇవ్వాలని గులాబీ బాస్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది.

అదే జరిగితే… గురవయ్య, రంజిత్‌, అంజయ్యల్లో ఎవరికి సీటు దక్కుతుందనేది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు భగత్‌ అధిష్టానం చెప్పినట్లు వింటారా… లేదంటే మరో ఆలోచన చేస్తారా… అన్నది చర్చనీయాంశమైంది.