ఈ నెల మూడో వారంలో బడ్జెట్‌ సమావేశాలు..? ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

|

Mar 06, 2021 | 4:26 PM

బడ్జెట్‌ సమావేశాలకు సీఎం కేసీఆర్‌ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావుతోపాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో ప్రగతి భవన్‌లో..

ఈ నెల మూడో వారంలో బడ్జెట్‌ సమావేశాలు..? ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష
Follow us on

బడ్జెట్‌ సమావేశాలకు సీఎం కేసీఆర్‌ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావుతోపాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌, బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ తదితర విషయాలపై సీఎం వీరితో సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశంలో బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల మూడో వారంలో బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశముందని సమాచారం. బడ్జెట్‌ రూపకల్పనపై ఇప్పటికే ఆర్థికశాఖకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక నిపుణులు బడ్జెట్‌కు తుదిరూపం ఇచ్చే పనిలో బిజీ అయ్యారు. ఆర్థికశాఖ రూపొందించిన బడ్జెట్‌ వివరాలపై అధికారులను సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి బడ్జెట్‌ రూపకల్పన తర్వాత మరోసారి సీఎం కేసీఆర్‌ పరిశీలించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. మార్చి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి రానున్న నిధులపై స్పష్టత వచ్చింది. ఇందుకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రూపొందించే పనిలో పడింది.

ఈమేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన చేయవలసిందిగా ఆర్థికశాఖకు సూచించారు. త్వరితగతిన బడ్జెట్ తయారీ ప్రక్రియ పూర్తయితే మార్చి మూడో వారం లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఆచితూచి వ్యవహరించనున్నట్లుగా తెలుస్తుంది.

Read More:

దూషణలపై వడ్డీతో సహా సమాధానం.. అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్వీకి కేటీఆర్ మార్గనిర్దేశం

ఐటీఐఆర్, రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై లేఖల డ్రామా.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్‌ ధ్వజం