- Telugu News Photo Gallery Political photos International womens day 2021 10 most powerful female politicians in india
Women’s Day-Political Leaders: భారతీ రాజకీయ యవనికపై తమదైన ముద్రవేసి ప్రతిభావంతులుగా ప్రసిద్ధి గాంచిన మహిళలు
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను జరుపుకుంటున్నాం.. ఈ సందర్భంగా సాంస్కృతిక, సామజిక, రాజకీయ యవనికపై తమదైన ముద్ర వేసిన మహిళలను గుర్తు చేసుకుందాం. మహిళలకు రాజకీయాలు ఎందుకు అన్న ఆలోచనను పటాపంచలు చేస్తూ.. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసి విశేష ప్రతిభను కనబరిచిన శక్తివంతమైన మహిళల గురించి తెలుసుకుందాం
Updated on: Mar 06, 2021 | 5:44 PM

విజయలక్ష్మి పండిట్ భారత దేశంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళ. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు సోదరి. విజయలక్ష్మి పండిట్ స్వాతంత్యానికి ముందు అంటే 1937 లో, బ్రిటిష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్సులలో మొదటి మహిళా క్యాబినెట్ మంత్రి అయ్యారు. అనంతరం ఆమె స్వాతంత్య పోరాటంలో పాల్గొన్నారు. సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్య వేత్త. 1962 నుండి 1964 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు.

భారత కోకిలాగా ప్రసిద్ధి పొందిన సరోజిని నాయుడు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. 1905 లో బెంగాల్ విభజన సమయంలో భారత జాతీయ ఉద్యమంలో చేరారు. ఈ ఉద్యమంలో మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్వంటి ప్రముఖులను కలిశారు. మహిళ హక్కులకోసం పోరాడారు. అంతేకాక మంచి రచయిత. స్వాతంత్య అనంతరం ఉత్తర ప్రదేశ్ మొదటి గవర్నర్ గా పనిచేశారు.

Indira Gandhi

కమలాదేవి చటోపాధ్యాయ ఒక సామాజిక సంస్కర్త మరియు స్వాతంత్ర సమరయోధురాలు. ఆమె సమాజం కోసం చేసిన కృషికి గాను పద్మ భూషణ్, మాగ్సేసే అవార్డులు లభించాయి. రాజకీయ ఎన్నికల్లో నిలబడిన తొలి భారతీయ మహిళ కమలదేవి. ఇది 1920 లో మహాత్మాగాంధీ సహాయనిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్రను పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా మన చేనేత, హస్తకళలు ప్రత్యేక గురింపు తేవడానికి కృషి చేశారు.

దేశ తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు సుచేతా కృపాలని, తన భర్త స్థాపించిన కిపన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుంచి పోటీ చేసిన కృపాలానీ కాంగ్రెస్ అభ్యర్థి, నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యురాలు మన్మోహిని సెహగల్‌ను ఓడించారు. సుచేత కృపలాని 1957 లో కాంగ్రెస్‌లో చేరి తిరిగి ఎన్నికయ్యారు. 1963 లో ఆమె ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ని చేపట్టారు. దేశంలో మొదటి మహిళగా ఖ్యాతిగాంచారు.

అనీ బిసెంట్ విదేశంలో జన్మించినా దేశం స్వాతంత్యం కోసం పోరాడిన ధీరవనిత. 1914 లో కామన్ వెల్త్' అనే వారపత్రికను స్థాపించారు. , దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, 1917 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు.

బీజేపీలో ప్రముఖ నాయకురాలు సుష్మా స్వరాజ్. కేంద్ర మంత్రిగా పదవి లో ఉన్న సమయంలో కూడా తన మంచి మనసు.. ప్రవర్తనతో అందరి మన్ననలను పొందారు సుష్మా. 1973 లో సుప్రీంకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆమె విద్యార్థి జీవితం నుండి గొప్ప వక్త. 27 ఏళ్ల వయసులోనే మంత్రి పదవి చేపట్టారు. ఇక 1990 ఏప్రిల్‌లో ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నో పదవులను చేపట్టిన సుష్మా ప్రతి పదవిని చక్కగా నిర్వహించారు.


మాయావతి దళిత సమాజం యొక్క ముఖ్య ప్రతినిధి తాను సమాజంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం నుంచి పాఠం నేర్చుకుని దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలిగా దళితుల హక్కుల కోసం వారితరఫున పోరాడారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పనిచేశారు.

ప్రస్తుతం రాజకీయల్లో ఒక సంచలన లేడీ మమతా బెనర్జీ. 1970 లోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆమె 1991 నుండి 2011 వరకు ఎంపీగా ఉన్నారు. 1999 లో అటల్ బీహార్ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆమె రైల్వే మంత్రిగా పనిచేశారు. అనంతరం 2009 లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండో సారి పదవిని నిర్వహిస్తున్నారు. .




