CM Jagan: రెండు రోజు జగన్ బస్సుయాత్ర.. అన్ని వర్గాలు వైసీపీకి బ్రహ్మరథం

ఏపీ సీఎం జగన్ రెండో రోజు యాత్రలో ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకుని అక్కడి ప్రజలతో సమావేశం అయ్యారు. సంక్షేమ పథకాలపై.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఒక్క ఎర్రగుంట్లకు.. 58 నెలల్లో తామేం చేశామన్నది.. లెక్కలతో సహా వివరించారు సీఎం జగన్. ఎర్రగుంట్లలో 93శాతం ప్రజలకు పార్టీలు చూడకుండా సంక్షేమం అందించామన్నారు.

CM Jagan: రెండు రోజు జగన్ బస్సుయాత్ర.. అన్ని వర్గాలు వైసీపీకి బ్రహ్మరథం
Ys Jagan
Follow us

|

Updated on: Mar 28, 2024 | 3:10 PM

ఏపీ సీఎం జగన్ రెండో రోజు యాత్రలో ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకుని అక్కడి ప్రజలతో సమావేశం అయ్యారు. సంక్షేమ పథకాలపై.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఒక్క ఎర్రగుంట్లకు.. 58 నెలల్లో తామేం చేశామన్నది.. లెక్కలతో సహా వివరించారు సీఎం జగన్. ఎర్రగుంట్లలో 93శాతం ప్రజలకు పార్టీలు చూడకుండా సంక్షేమం అందించామన్నారు. మొత్తం 1391 మంది ఇళ్లకు చెందిన లబ్దిదారులకు.. వివిధ పథకాల ద్వారా 48 కోట్ల.. 74లక్షల 34వేల 136 రూపాయలు అందించామన్నారు సీఎం జగన్. అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేశామన్నారు సీఎం.

ఆ తర్వాత దాదాపు గంటకు పైగా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు సీఎం జగన్. పథకాలతో.. తాము ఎంతలా లబ్ది పొందామో.. సీఎంకు వివరించారు ఎర్రగుంట్ల ప్రజలు. ఇన్నేళ్లలో.. ఏ ప్రభుత్వంలోనూ ఇంతలా లబ్ధి పొందలేదని.. ఎమోషనల్ అయ్యారు. ఇదే సమయంలో ఓ అభిమాని.. జగన్‌ను మిమిక్రి చేశారు. బహిరంగ సభల్లో జగన్ ఎలా మాట్లాడతారో అదేవిధంగా మిమిక్రీతో ఆకట్టుకున్నాడు ప్రసాద్ అనే అభిమాని.

మిమిక్రి తర్వాత ప్రసాద్‌ను స్టేజ్‌పైకి పిలిపించుకుని ఆప్యాయంగా మాట్లాడారు సీఎం జగన్. వారితో కలిసి ప్రత్యేకంగా ఫొటో దిగారు. ఎర్రగుంట్ల ప్రజలతో.. ముఖాముఖిలో.. చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు సీఎం జగన్. 75ఏళ్ల వయసున్న వారు.. 14 ఏళ్లు అధికారంలో ఉన్నా.. చిన్నవాడైన తాను చేసిన పనులు చేయలేకపోయారన్నారు. ఎర్రగుంట్ల నుంచి దీబగుంట్ల మీదుగా నూనెపల్లి క్రాస్ దగ్గరకు చేరుకుని.. అక్కడ భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్. సాయంత్రం నాలుగున్నరకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు జగన్. సభ తర్వాత.. పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, నాగలాపురం మీదుగా పెంచికలపాడులో నైట్ క్యాంప్‌కు చేరుకుంటారు సీఎం జగన్.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో