టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పారు. అవును మీరు వింటున్నది నిజమే. అయితే అది ఏ ఇష్యూలో అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇటీవల కేంద్రం రిలీజ్ చేసిన నేషనల్ మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతి మిస్సయిన విషయం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో క్వచ్ఛన్ రైజ్ చేశారు. దీంతో అలర్టయిన కేంద్ర హోంశాఖ.. అమరావతిని ఏపీ రాజధానిగా చేర్చి నయా మ్యాప్ విడుదల చేసింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోమంత్రి అమిత్ షా, హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలకు లేఖలు రాశారు. అందులో మోదీకి స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు.
మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన అమరావతి మ్యాప్‌లో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆందోళనకు గురయ్యారని ఆయన లేఖలో ప్రస్తావించారు. టీడీపీ ఎంపీలు సమస్యను ప్రస్తావించిన వెంటనే స్పందించినందుకు చంద్రబాబు.. కేంద్ర మంత్రులకు లేఖల ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో విబేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ వ్యతిరేక కూటమి కట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్‌తో కలిసి నడిచారు. పలు రాష్ట్రాల్లో బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా..ఏపీ ఎన్నికల సమయంలో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోసం చేసిందంటూ ఫైరయ్యారు. కానీ ఫలితాల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. బీజేపీ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా బంఫర్ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఏపీలో టీడీపీ కూడా ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఇక అప్పట్నుంచి బాబు సైలెంట్ అయ్యారు. ఇటీవల కొన్ని వేదికల్లో రాష్ట్ర హక్కుల కోసమే మోదీతో విబేధించానని, ఆయనతో తన ఎటువంటి కక్షలు లేవంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా మోదీకి బాబు థ్యాంక్స్ చెప్పడం చూస్తుంటే..బాబు, బీజేపీతో స్నేహ హస్తం అందుకోడానికి ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Taking note of the issue of Amaravati missing from the map, raised by Hon’ble MPs of AP in the Parliament yesterday, I took up the matter with the concerned.
The error has been rectified.
Here is the revised map of India.@JayGalla @MithunReddyYSRC
PC: Survey of India pic.twitter.com/XjCW2a3WIT— G Kishan Reddy (@kishanreddybjp) November 22, 2019