Chandrababu Meet Seethakka : సీతక్క తల్లిని పరామర్శించిన చంద్రబాబు నాయుడు.. థ్యాంక్స్ అన్నా అంటూ కంటతడి పెట్టిన ఎమ్మెల్యే..

|

Jun 07, 2021 | 6:39 PM

Chandrababu Meet Seethakka : ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్కను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

Chandrababu Meet Seethakka : సీతక్క తల్లిని పరామర్శించిన చంద్రబాబు నాయుడు.. థ్యాంక్స్ అన్నా అంటూ కంటతడి పెట్టిన ఎమ్మెల్యే..
Chandrababu
Follow us on

Chandrababu Meet Seethakka : ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్కను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలో పరామర్శించారు. హైదరాబాదులోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో ఎమ్మెల్యే సీతక్క తల్లి సమ్మక్క అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లి సమ్మక్కను పరామర్శించి సీతక్కకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఆమె ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే సీతక్కతోనూ, ఏఐజీ వైద్యులతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క కంటతడి పెట్టారు.

చంద్రబాబు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. సీతక్క నిరాడంబరత, ప్రజాసేవ, క్రమశిక్షణ తదితర అంశాలను చంద్రబాబు అక్కడి వైద్యులకు వివరించారు. ఆమె ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడుతూ అభినందించారు. తన గురించి చంద్రబాబు వైద్యులకు వివరించడంతో సీతక్క ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. థాంక్స్ అన్నా అంటూ సీతక్క తన ట్విట్టర్ అకౌంట్లో చంద్రబాబు సందర్శన వీడియోను పంచుకున్నారు. కాగా గతంలో సీతక్క టీడీపీ పార్టీ సభ్యురాలే కావడం గమనార్హం. ఇటీవల తన నియోజకవర్గంలో ఆదివాసీలు పస్తులు ఉంటున్నారని తెలుసుకొని ఎండ్లబండిలో వెళ్లి సరుకులు అందించి తన సేవాభావాన్ని చాటుకున్నారు. సరైన రోడ్డు మార్గం లేని మారుమూల పల్లెలకు సైతం వెళ్లి తనకు చేతనైన సాయం చేస్తున్నారు.

PM Modi Speech: : 18 ఏళ్ళు దాటిన అందరికీ ఉచిత వాక్సిన్.. మొత్తం బాధ్యత కేంద్రానిదే.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని నరేంద్రమోదీ..

Balakrinshna: బాలయ్య పుట్టిన రోజుకు డబల్ సార్ప్రైజ్ ఉండనుందంట.. అభిమానులకు పండగే..