చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆరే కనబడుతున్నారు: తలసాని

హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజకీయాలు మన కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయని, చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆరే కనిపిస్తున్నారని అన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రతి ప్రసంగంలో చంద్రబాబు కేసీఆర్‌ పేరునే తలుస్తున్నారని విమర్శించారు. భారత దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ నగరంలో ఉన్నారని, అందరినీ అక్కున చేర్చుకుని కడుపులో పెట్టి చూసుకుంటున్నామని తలసాని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం చంద్రబాబు సిగ్గు […]

చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆరే కనబడుతున్నారు: తలసాని

Updated on: Mar 29, 2019 | 7:57 PM

హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజకీయాలు మన కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయని, చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆరే కనిపిస్తున్నారని అన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రతి ప్రసంగంలో చంద్రబాబు కేసీఆర్‌ పేరునే తలుస్తున్నారని విమర్శించారు. భారత దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ నగరంలో ఉన్నారని, అందరినీ అక్కున చేర్చుకుని కడుపులో పెట్టి చూసుకుంటున్నామని తలసాని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో మాత్రం చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఆంధ్రా ప్రజలను సరిగా చూసుకోవడం లేదు, కొడుతున్నారు, ఆస్తులు లాగేసుకుంటున్నారు, నోటీసులు ఇస్తున్నారంటూ మాట్లాడుతున్నారని తలసాని మండిపడ్డారు. అసలు హైదరాబాద్‌లో అందరికంటే ఎక్కువ ఆస్తి ఉన్నది చంద్రబాబుకే, ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని తలసాని అన్నారు.

ఏపీలో ఏ టీవీ చూసినా మన ముఖ్యమంత్రి గురించే మాట్లాడుతున్నారని, ఏపీ రాజకీయాలన్నీ మన సీఎం చుట్టే తిరుగుతున్నాయని అన్నారు. ఒక విజన్ ఉన్నటువంటి కేసీఆర్ ఈ దేశానికే ఆదర్శమయ్యారు, పీఎం నుంచి అన్ని రాష్ట్రాల సీఎంల వరకు మనవైపే చూస్తున్నారు. మనం తప్పకుండా 16 సీట్లు గెలుస్తున్నామని తలసాని శ్రీనివాస యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.