విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కొనేదెవరో చెప్పేసిన కేంద్ర మంత్రి.. 2019లోనే ఎంవోయూ కుదిరినట్లు వెల్లడి

|

Feb 10, 2021 | 6:46 PM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై ఏపీలో కార్మిక సంఘాలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అధికార, ప్రతిపక్షాలు..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కొనేదెవరో చెప్పేసిన కేంద్ర మంత్రి.. 2019లోనే ఎంవోయూ కుదిరినట్లు వెల్లడి
Follow us on

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై ఏపీలో కార్మిక సంఘాలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అధికార, ప్రతిపక్షాలు అనే తేడా లేకండా పార్టీలకతీతంగా కేంద్రం తీరుపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ రాజ్యసభలో స్పందించారు.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన మిగులు భూమిలో గ్రీన్‌ ఫీల్డ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్‌ ఆసక్తి కనబర్చినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజ్యసభలో వెల్లడించారు. ఆయన ఈ అంశంపై రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. పోస్కో- ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య 2019 అక్టోబర్‌లో ఎంవోయూ కుదిరినట్లు పేర్కొన్నారు.

ఎంయోయూకు అనుగుణంగా ఉభయ పక్షాల మధ్య పరస్పర సమాచార మార్పిడి కోసం ఒక జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పడిందన్నారు. ప్లాంట్‌లో ఎవరి వాటా ఎంత ఉండాలన్న అంశం ఇంకా ఖరారు కాలేదని, అయితే ఎంవోయూ ప్రకారం 50 శాతం మేరకు తమకు వాటా ఉండాలని పోస్కో స్పష్టం చేసిందని వివరించారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ వాటా ఎంత ఉండాలన్నది, అది కేటాయించే భూముల విలువపై ఆధారపడి ఉంటుందని మంత్రి వెల్లడించారు.

 

Read more:

తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన టీడీపీ అధినేత.. చంద్రబాబు ఏమన్నారంటే..