మేకప్ వేసుకుంటే పవన్ సిఎం అయిపోతారా ?

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సినీ రైటర్ చిన్నికృష్ణ సెటైర్లు వేశారు. సినిమాల్లో మాదిరి పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకుంటే ముఖ్యమంత్రి అయిపోతారా అని ప్రశ్నించారు. నేనూ సీఎం కావాలని అనుకుంటున్నా..అయితే అయిపోతానా అన్నారు. పవన్ కి సినిమా ఆఫర్లు ఉన్నాయని, ఆయనకు మళ్ళీ చాన్సిచ్చే నిర్మాతలు ఎవరో తనకు తెలుసునని చిన్నికృష్ణ చెప్పారు. పవన్ తిరిగి ముఖానికి మేకప్ వేసుకుని సినిమాలు చేస్తారు.. ఆయనకు బ్లాక్ బస్టర్స్ అవసరంలేదు. అందుకే స్టోరీలు రాయమని మా […]

మేకప్ వేసుకుంటే పవన్ సిఎం అయిపోతారా ?

Updated on: May 21, 2019 | 11:23 AM

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సినీ రైటర్ చిన్నికృష్ణ సెటైర్లు వేశారు. సినిమాల్లో మాదిరి పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకుంటే ముఖ్యమంత్రి అయిపోతారా అని ప్రశ్నించారు. నేనూ సీఎం కావాలని అనుకుంటున్నా..అయితే అయిపోతానా అన్నారు. పవన్ కి సినిమా ఆఫర్లు ఉన్నాయని, ఆయనకు మళ్ళీ చాన్సిచ్చే నిర్మాతలు ఎవరో తనకు తెలుసునని చిన్నికృష్ణ చెప్పారు. పవన్ తిరిగి ముఖానికి మేకప్ వేసుకుని సినిమాలు చేస్తారు.. ఆయనకు బ్లాక్ బస్టర్స్ అవసరంలేదు. అందుకే స్టోరీలు రాయమని మా లాంటివాళ్లను కోరరు అన్నారు. కాగా ఏపీలో టీడీపీకి 50 సీట్లు వస్తాయని, జనసేనకు 5 కు మించి సీట్లు రావని ఆయన చెప్పారు. అయితే వైసీపీ,  కాంగ్రెస్, బీజేపీలకు ఎన్ని స్థానాలు వస్తాయో చెప్పేందుకు చిన్నికృష్ణ నిరాకరించారు. ప్రధాని మోదీ మళ్ళీ ఈ దేశ ప్రధాని కావాలని ఆయన కోరారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిన్నికృష్ణ ఇలా తన మనసులోని మాటను బయటపెట్టారు.