సాగర్‌ ఫలితాల్లో కారో జోరు.. 18వ రౌండ్ ముగిసేసరికి నోముల భ‌గ‌త్‌కు 13,396 ఓట్ల ఆధిక్యం

|

May 02, 2021 | 1:21 PM

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో కారు జోరు మీదుంది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా భారీ మెజార్టీ వైపు దూసుకెళుతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్..

సాగర్‌ ఫలితాల్లో కారో జోరు.. 18వ రౌండ్ ముగిసేసరికి నోముల భ‌గ‌త్‌కు 13,396 ఓట్ల ఆధిక్యం
Nomula Bhagath
Follow us on

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో కారు జోరు మీదుంది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా భారీ మెజార్టీ వైపు దూసుకెళుతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమైపోయింది. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబు‌ళ్లపై లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఉండ‌డంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి‌కా‌నుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధి‌కా‌రి‌కంగా విజే‌తను ప్రక‌టించే అవ‌కాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్‌ సందర్భంగా కొవిడ్‌ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో సహా పోలింగ్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. కౌంటింగ్‌లో 400 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండ‌గా, బీజేపీ అడ్ర‌స్ గ‌ల్లంతు అయింది. ప్ర‌తీ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీ మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తోంది. 18వ‌ రౌండ్ ముగిసే స‌రికి 13,396 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. తొలి తొమ్మిది రౌండ్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌గా, 10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,854, కాంగ్రెస్‌కు 3113 ఓట్లు వ‌చ్చాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి. నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వ‌చ్చాయి. ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్‌కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోల‌య్యాయి. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు వ‌చ్చాయి.

ఏడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,022, కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు వ‌చ్చాయి. ఎనిమిది రౌండ్లో టీఆర్ఎస్‌కు 3, 249, కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు పోల‌య్యాయి. తొమ్మిదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,205, కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు, ప‌దో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,991, కాంగ్రెస్‌కు 3,166 ఓట్లు రాగా, ప‌ద‌కొండో రౌండ్‌లో టీఆర్ఎస్ కు 3,395, కాంగ్రెస్ పార్టీకి 2,225 ఓట్లు వ‌చ్చాయి. ప‌న్నెండో రౌండ్‌లో టీఆర్ఎస్ కు 3833, కాంగ్రెస్ కు 2578 ఓట్లు, ప‌ద‌మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,766 ఓట్లు, కాంగ్రెస్ కు 3546 ఓట్లు వ‌చ్చాయి. 14వ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 2,734 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 3,817 ఓట్లు రాగా, 15వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3203, కాంగ్రెస్ కు 2787 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.