Telangana: “బాంబుల” చుట్టూ తెలంగాణ రాజకీయం.. మంత్రి పొంగులేటి కామెంట్స్‌పై దుమారం..!

దీపావళి కంటే ముందే బాంబులు పేలబోతున్నాయన్నారు మంత్రి పొంగులేటి.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉండబోతున్నాయన్నారు. అయితే ఇలాంటి ఉత్తుత్తి బాంబులకు భయపడేది లేదని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.

Telangana: బాంబుల చుట్టూ తెలంగాణ రాజకీయం.. మంత్రి పొంగులేటి కామెంట్స్‌పై దుమారం..!
Brs Socisal Media Team
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 25, 2024 | 4:40 PM

సౌత్ కొరియా పర్యటనలో ఉన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సీయోల్ నగరంలో ఉన్న హన్ రివర్ ప్రాజెక్టు సందర్శనకు ఆయన కొంతమంది బృందంతో అక్కడికి వెళ్లారు. నాలుగు రోజులపాటు సాగిన ఈ పర్యటనలో ఆయనతోపాటు జర్నలిస్టులు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పాల్గొన్నారు. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఈ బృందం అధ్యయనం చేసి తిరిగి బయలుదేరింది. అయితే అక్కడే టీవీ9 తో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మూసీ రివర్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే.. పొలిటికల్ అంశాలపై బాంబులు పేల్చారు.

సౌత్ కొరియా నుంచి హైదరాబాద్‌లో ఫ్లైట్ దిగేలోగా, బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఉంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాు మంత్రి పొంగులేటి. దీపావళి కంటే ముందే బాంబులు పేలబోతున్నాయన్నారు మంత్రి పొంగులేటి.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉండబోతున్నాయన్నారు. ఒకటి నుంచి తొమ్మిది వరకు నిందితుల లిస్ట్ సైతం రెడీ అయిందని, ఒక్కొక్కరుగా అరెస్టు అవుతారంటూ చెప్పారు. దాంతోపాటే పదేళ్ల ప్రభుత్వంలో చేసిన అక్రమాల చిట్టా తయారుగా ఉంది. ఇక లోపలికి వెళ్ళడమే మిగిలింది అంటూ కామెంట్స్ చేశారు.

గత రెండు రోజులుగా పొంగులేటి సియోల్ లో చేసిన కామెంట్స్ పై తెలంగాణలో రచ్చ మొదలైంది. ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ స్టార్ట్ అయింది. ఇదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి నేతలు మాత్రం పొంగులేటివి ఉత్తుత్తి టపాసులు అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి ఉత్తుత్తి టపాసులకు భయపడేది లేదని కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు. ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేస్తారేమో.. చేసుకోండి, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు కేటీఆర్.

అంతేకాదు సోషల్ మీడియాలో ఆయన ఫ్లైట్ దిగగానే బాంబులతో స్వాగతం అంటూ బీఆర్ఎస్ నేతలు పోస్టర్లు రెడీ చేశారు. పిఎస్ఆర్ మూసీ బాంబ్, పొంగులేటి 15,0000 వాలా, పొంగులే బాంబ్, మూసీ ముఠాకి స్వాగతం అంటూ సోషల్ మీడియాలో పింక్ బ్యాచ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయింది. లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్టును సూచిస్తూ గ్రాఫిక్స్ లో ఈ పోస్టర్లు రెడీ చేశారు. పొంగులేటి సౌత్ కొరియాలో ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కారు.. ఈరోజు రాత్రి కల్లా హైదరాబాద్‌లో దిగిపోతారు. మరీ ఆయన చెప్పిన బాంబులేవీ ఇక్కడ పేలలేదు అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది. హైట్ కోసం కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు తప్పా.. అసలు మ్యాటర్ లేదని ఎత్తిపొడుస్తోంది బీఆర్ఎస్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..