సెంట్రల్ ఫలితంపై కోర్టుకు బోండా ఉమ

| Edited By: Pardhasaradhi Peri

Jun 15, 2019 | 4:22 PM

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీతో గెలిచిన వ్యక్తి మల్లాది విష్ణు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసిన ఆయన కేవలం 25 ఓట్ల తేడాతో నెగ్గారు. అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమా ఎన్నికల ఫలితంపై ముందు నుంచే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జనసేన పార్టీ పొత్తులో భాగంగా సీపీఎం నుంచి బాబురావుకు సీటు కేటాయించింది. ఆయనకి వ్యక్తిగతంగా మంచి పేరు ఉండటంతో […]

సెంట్రల్ ఫలితంపై కోర్టుకు బోండా ఉమ
Follow us on

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీతో గెలిచిన వ్యక్తి మల్లాది విష్ణు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసిన ఆయన కేవలం 25 ఓట్ల తేడాతో నెగ్గారు. అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమా ఎన్నికల ఫలితంపై ముందు నుంచే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

జనసేన పార్టీ పొత్తులో భాగంగా సీపీఎం నుంచి బాబురావుకు సీటు కేటాయించింది. ఆయనకి వ్యక్తిగతంగా మంచి పేరు ఉండటంతో భారీగానే ఓట్లు రాబట్టగలిగారు. దీంతో ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన వైసీపీ నేత వంగవీటి రాధా బొండా ఉమాకి మద్ధతుగా ప్రచారం చేసినప్పటికి స్వల్ప ఓట్లతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. అయితే ఫలితం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న బోండా న్యాయపోరాటానికి సిద్దమయ్యారు.  ప్రస్తుతం ఫలితానికి సంబంధించి కోర్టులో బోండా ఉమ తరఫున పిటిషన్ దాఖలు అయ్యింది. పదకొండు వీవీ ప్యాట్లను లెక్కించకుండానే ఫలితాన్ని ప్రకటించారని ఇంకా కౌంటింగ్ విషయంలో మరిన్ని అనుమానాలున్నాయని బోండా ఆరోపిస్తున్నట్టు సమాచారం. పిటీషన్‌ను విచారణకు తీసుకున్న కోర్టు.. ఈసీ కి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి.