BJP Bandi Sanjay: దళిత బంధుపై యాదాద్రిలో తేల్చుకుందాం.. టీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరిన బండి సంజయ్..

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. 20వేలు తీసుకొని ఓటు మాత్రం..

BJP Bandi Sanjay: దళిత బంధుపై యాదాద్రిలో తేల్చుకుందాం.. టీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరిన బండి సంజయ్..
Bandi Sanjay

Updated on: Oct 20, 2021 | 12:58 PM

Huzurabad By-Election: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. 20వేలు తీసుకొని ఓటు మాత్రం బీజేపీకి వేయాలని ఓటర్లను కోరారు. దళిత బంధు పేరుతో పేదోళ్ల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. దళిత బంధు బీసీలు వద్దన్నన్నారని కేసీఆర్ అన్నాడని.. దళిత బంధు పేరుతో పేదోళ్ల మధ్య చిచ్చు పెడుతున్నాడని మండిపడ్డారు. దళిత బంధును తమ పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలేదని.. హైదరాబాద్ ఎన్నికల సమయంలో కూడా తన సంతకము ఫోర్జరీ చేసారని ఆరోపించారు. అప్పుడు నిజం తేల్చుకుందాం భాగ్యలక్ష్మి టెంపుల్ కి రమ్మన్నా రాలేదని ఎద్దేవ చేశారు. దళిత బంధు ఇవ్వమని మేము చెప్పామని.. బ్యాంకు ఎకౌంట్ లో వేసిన డబ్బులు తీసుకొనివ్వలేదని మండిపడ్డారు.

దళిత బంధు పైసలు ఇవ్వమని తాను కూడా చెప్పానని.. దళిత బంధుపై నీతి నిజాయితీ ఉందో.. దళిత బంధుపై మీకు నీతి నిజాయితీ ఎంత ఉందో యాదాద్రిలో తేల్చుకుందామని టీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. దళితబంధు ఆపాలని తాము ఎప్పుడు ఈసీని కోరలేదన్నారు బండి సంజయ్‌.  ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇచ్చే వరకూ ఉద్యమం చేస్తానని స్పష్టం చేశారు బండి సంజయ్‌. ఈటలను ఇబ్బంది పెట్టడానికి టి ఆర్ యస్ వేల కోట్లు ఖర్చు చేస్తుందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: LPG Gas Booking – WhatsApp: వాట్సాప్‌తో ఓ మెసెజ్‌ చేస్తే చాలు మీ LPG గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది.. ఎలా చేయాలో తెలుసా..

Online Shopping: భారీ ఆఫర్లు ఉన్నాయని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ ఐదు సంగతులు గుర్తుంచుకోండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us