MLC candidate : బీజేపీ కేంద్ర కమిటీ అనూహ్య నిర్ణయం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి

|

Jan 16, 2021 | 8:28 PM

బీజేపీ కేంద్ర కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి నేత, మైనారిటీ వర్గం కీలక నేత సయ్యద్ షాహనవాజ్ హుస్సేన్‌ను మండలికి పంపాలని నిర్ణయం తీసుకుంది. బిహార్ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో..

MLC candidate : బీజేపీ కేంద్ర కమిటీ అనూహ్య నిర్ణయం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి
Follow us on

Shahnawaz Hussain : బీజేపీ కేంద్ర కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి నేత, మైనారిటీ వర్గం కీలక నేత సయ్యద్ షాహనవాజ్ హుస్సేన్‌ను మండలికి పంపాలని నిర్ణయం తీసుకుంది. బిహార్ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. షాహనవాజ్ హుస్సేన్ గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. జాతీయ స్థాయిలో కీలక నేతగా.. అంతటి కీలక నేతను మండలికి పంపడం రాజకీయంగా ఆశ్చర్యకర పరిణామమే అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మరోవైపు యూపీలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 6 స్థానాలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అభ్యర్థులను ప్రకటించారు. మానవేంద్ర సింగ్, గోవింద్ నారాయణ శుక్లా, సలీల్ బిష్ణోయ్, అశ్వనీ త్యాగీ, ధర్మవీర్ ప్రజాపతి, సురేంద్ర చౌదరి పేర్లను శనివారం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతం.. తొలి రోజు 3,530 మందికి టీకా అందించామన్న హెల్త్‌ డైరెక్టర్

Hunting For Tiger : పులి జాడెక్కడ..? టైగర్‌ చిక్కేదెప్పుడు..? ఫారెస్ట్ అధికారులను వెంటాడుతున్న ప్రశ్నలు..