ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా.. దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉందంటూ జీవీఎల్ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Jan 17, 2021 | 7:02 PM

ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోయిందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. బాధ్యులపై చర్యలు..

ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా.. దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉందంటూ జీవీఎల్ ఫైర్
Follow us on

BJP MP GVL Narasimha Rao : ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోయిందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం ద్వారా పరోక్షంగా అలాంటి చర్యలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందే తప్ప.. దోషులను పట్టుకోవాలని చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. అసలైన నేరస్తులను పట్టుకోకుండా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని బీజేపీకి చెందినవారిని అరెస్ట్‌ చేయడం సిగ్గుచేటన్నారు జీవీఎల్‌.

రామతీర్థం వెళ్లకుండా బీజేపీని అడ్డుకోవడం వెనక ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలు కనిపిస్తున్నాయన్నారు. హిందూ పేర్ల ముసుగులో అనేకమంది క్రిస్టియన్లు హిందువులను వేధిస్తున్నారని…, మత మార్పిళ్లకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీనిపై కేంద్రంతో మాట్లాడుతా అన్నారు.

హిందూ దేవుళ్లను కించపరిచేలా పోస్టులు పెట్టిన ఫాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తిని ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా చేర్చాలన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. దీన్నుంచి అతణ్ని తప్పించాలని చూస్తే ప్రభుత్వం అపఖ్యాతి పాలవుతుందని, జాతీయస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతుందన్నారు.

ఇవి కూడా చదవండి :

Cooked Chicken : నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. ఇలా చేసి తినమంటు సూచనలు చేసిన కేంద్రం

తిరుమల ఆలయం పరిసరాల్లో అడవి పందుల సంచారం.. స్పందించిన టీటీడీ అధికారులు