MP GVL: ఎనకటికి ఒకాయన ఇట్లనే ఇలాగే చేసి బోర్లాపడ్డారు.. సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ సెటైర్లు

|

May 23, 2022 | 4:16 PM

చంద్రబాబు ఇలాగే కేంద్రంపై పోరాటం అని బయలుదేరి బొక్కబోర్లా పడ్డారని, కావాలంటే జూబ్లీహిల్స్‌లోనే ఉండే ఆయన దగ్గరకు వెళితే TRS నేతలకు బాగా అర్థమవుతుందని కామెంట్‌ చేశారు. జాతీయ రాజకీయాల్లో ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు.. తప్పులేదు. కానీ..

MP GVL: ఎనకటికి ఒకాయన ఇట్లనే ఇలాగే చేసి బోర్లాపడ్డారు.. సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ సెటైర్లు
Mp Gvl
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై(CM KCR) సైటర్లు సంధించారు బీజేపీ ఎంపీ జీవీఎల్(GVL). కేసీఆర్‌ను చూస్తుంటే చంద్రబాబు గుర్తొస్తున్నారని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ జీవీఎల్. గతంలో చంద్రబాబు ఇలాగే కేంద్రంపై పోరాటం అని బయలుదేరి బొక్కబోర్లా పడ్డారని, కావాలంటే జూబ్లీహిల్స్‌లోనే ఉండే ఆయన దగ్గరకు వెళితే TRS నేతలకు బాగా అర్థమవుతుందని కామెంట్‌ చేశారు. జాతీయ రాజకీయాల్లో ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు.. తప్పులేదు. కానీ ఆ పరిస్థితి మరొకరికి రావొద్దని ఎద్దేవ చేశారు.  ఏదో సాధించాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తే.. ఉన్న రాష్ట్రంలో కూడా దక్కకుండా పోతుందని అన్నారు. ఇక్కడ ఇలా వుంటే.. ఏపీలో సర్కార్ మరోలా ఉందన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో కేంద్రం ఉచితంగా రేషన్ పంపిణీ చేసిందని.. అయితే ఏపీలో సగం జనాభా (89 లక్షల కుటుంబాల)కు కేంద్రం ఉచిత బియ్యం సరఫరా చేసిందని గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఇలాంటి పథకం ఎన్నడూ రాలేదని.. ఈ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. ఏపీలో ఏప్రిల్ – మే నెలల్లో అమలు చేయలేదన్నారు. ఏపీ డీసీపీ రాష్ట్రం. అక్కడే సేకరించి, అన్ని పథకాలకు వినియోగించిన తర్వాత మిగిలినవి మాత్రమే FCI సెంట్రల్ పూల్ కి ఇవ్వాల్సి ఉంటున్నారు. కానీ కేంద్రం ఇవ్వడం లేదంటూ అబద్ధాలు చెబుతున్నారు.

ప్రజలకు ఉచితంగా చేరాల్సిన బియ్యాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉచిత రేషన్ అంటే కేంద్రానికి క్రెడిట్ వస్తుందని అమలు చేయడం లేదా? లేక ఉచితం అంటే తాము మాత్రమే ఇస్తాం.. ఇంకొకరు ఇస్తే అడ్డుకుంటాం అనే వైఖరి కారణమా..? అంటూ జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రానికి రూ. 3,000 కోట్ల మేర అదనపు సబ్సిడీ దొరుకుతుంటే ఎందుకు దుర్మార్గంగా వ్యవహరిస్తోంది..? తెలంగాణలోనూ మే నెలలో పంపిణీ చేయలేదు..? ప్రధానమంత్రి అవాస్ యోజన కింద ఇళ్లను కూడా రాజకీయం చేయకుండా లబ్ధిదారులకు అందించాలని అన్నారు ఎంపీ జీవీఎల్.