తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఈ నెల 14న జరిగే పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు రంగంలోకి దిగి ప్రచారంలో స్పీడ్ పెంచారు. టీఆర్‌ఎస్ నుంచి జిల్లాలను పంచుకుని మరీ రంగంలోకి దిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఇక దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో ఫుల్ జోష్ మీదున్న బీజేపీ నేతలు అధికార పార్టీకి ధీటుగా ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని ముఖ్య నేతలే కాకుండా కేంద్రం నుంచి కీలక నేతలు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రుల ఓట్లను ఆకర్షించేందుకు నిరుద్యోగ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రచారంలో హీట్ పెంచుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ప్రచారం రక్తి కడుతుంది.
అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘునందన్‌రావు చేసిన కామెంట్స్ బీజేపీలో కలకలం రేపుతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళననికి ముఖ్యఅతిథిగా హాజరైన దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు నోరు జారారు.
వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి కి వ్యతిరేకంగా ఓటు వేయమని నోరు జారి మాట్లాడారు అన్ని మన పైసలే మన దగ్గర తీసుకున్న పైసలే మన భూముల్లో రియల్ ఎస్టేట్ చేసి సంపాదించిన పైసలు అని ఏ పార్టీవారు ఇచ్చినా కూడా డబ్బులు తీసుకొని బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వ్యతిరేకంగా వోట్ వెయ్యమని చెప్పి నోరు జారారు
అలాగే సమావేశం ముగించుకొని తోర్రుర్ సమావేశానికి వెళ్తుంటే మీడియా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,గ్యాస్,డీజిల్ ధరలపై మీ అభిప్రాయం అని అడుగగా నన్ను ఎందుకు అడుగుతున్నారు. జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్ గారిని అడగండి అని సమాధానం ఇచ్చారు….
బీజేపీ ఎమ్మెల్యే నోరుజారడం పట్ల స్థానిక కాషాయ క్యాడర్‌లో నిరుత్సాహం అలముకుంది. ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అలాంటిది తమ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయమని నోరుజారడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ విషయంలో కవాలని అనకపోయినా తర్వాత పెట్రోల్ డీజీఇల్ విషయంలో విలేకరుల ప్రశ్నకు సమాధానంపై క్యాడర్ మండిపడుతంది. ఆ విషయం బండి సంజయ్‌ను అడగాలని అనడం పట్ల బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇన్‌చార్జ్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృష్ణఆదిత్య తెలిపారు. ఈ నెల 14న జరుగునున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడి ఎన్నికల ఏర్పాట్లుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేయ్యాలన్నారు. పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి ఫర్నిచర్‌ను పరిశీలించాలన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీ్‌సబందోబస్త్ ఏర్పాటు చేయ్యాలన్నారు. పోలీస్‌బందోబస్త్ ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించి పోలింగ్ అనంతరం బ్యాలెట్ బ్యాక్సులను నల్గొండ జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ కేందానికి తరలించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణఆదిత్య మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల్లో 12, 388 మంది ఓటర్లు ఉన్నారని, మొత్తం 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో జేసీ కూరాకుల స్వర్ణలత, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Moe:
జనగాంలో రాష్ట్రస్థాయి కబట్టీ పోటీలు.. ప్రారంభోత్సవంలో కబడ్డీ ఆటతో అలరించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య