Nagarjuna Sagar bypoll: రవి నాయక్ సరే.. మరి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిన నివేదితా రెడ్డి పరిస్థితేంటి..? సాగర్‌ ఎన్నికల్లో ఇదే చర్చ..!

|

Mar 30, 2021 | 1:10 PM

బీజేపీ నేత నివేదితా రెడ్డి ఎపిసోడ్‌.. సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారామె. కానీ బీజేపీ రెబల్ అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. చివరిదాకా ఆమె బరిలో ఉంటారా..? సమయం లేదు మిత్రమా రణమే అంటూ క్యాంపెయిన్‌తో కాక పుట్టిస్తారా.. ?

Nagarjuna Sagar bypoll: రవి నాయక్ సరే.. మరి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిన నివేదితా రెడ్డి పరిస్థితేంటి..? సాగర్‌ ఎన్నికల్లో ఇదే చర్చ..!
Bjp Leader Nivedita Reddy V
Follow us on

BJP leader Nivedita Reddy: బీజేపీ నేత నివేదితా రెడ్డి ఎపిసోడ్‌.. సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారామె. కానీ బీజేపీ రెబల్ అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. చివరిదాకా ఆమె బరిలో ఉంటారా..? సమయం లేదు మిత్రమా రణమే అంటూ క్యాంపెయిన్‌తో కాక పుట్టిస్తారా.. ? ఇవేవీ కాకుండా పార్టీపై విధేయత చూపిస్తూ డ్రాప్ అవుతారా..? ఈ ప్రశ్నలే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.

భారతీయ జనతా పార్టీ ఎలాగైనా తనకే టికెట్ ఇస్తుందని భావించిన నివేదితా రెడ్డి.. ముందుగానే నామినేషన్ దాఖలు చేశారు. సీటు నాదే గెలుపు నాదే అన్న కాన్ఫిడెంట్‌తో ప్రచారం కూడా మొదలెట్టారు. కానీ సీన్ రివర్సయింది. అధికార టీఆర్‌ఎస్‌ బీసీ అభ్యర్థిని ఖరారు చేయడంతో బీజేపీ మనసు మార్చుకుంది. అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ.. లంబాడా సామాజిక వర్గానికి చెందిన రవినాయక్‌ను బరిలోకి దింపింది. దీంతో నివేదితా ఆశలు గల్లంతయ్యాయి. అయితే ఇప్పుడామె పోటీలో ఉంటారా..? తప్పుకుంటారా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ప్రస్తుతానికి నివేదితను రెబల్ అనాలా..? స్వతంత్ర అభ్యర్థి అనాలా అనే అంశంపై చర్చ నడుస్తోంది. పార్టీ కోసం పని చేసిన తనకు కాకపోతే.. టికెట్ ఇంకెవరికస్తారన్నది మొన్నటిదాకా ఆమె ధీమా. ఇప్పుడు అదే కాన్ఫిడెంట్‌తో బరిలో నిలుస్తారా అన్నది తేలాల్సి ఉంది.

ఇదంతా బీజేపీ వ్యూహమని కొందరు కొట్టిపడేస్తున్నారు. స్పేర్‌లో ఉంచేందుకే నివేదితతో నామినేషన్ వేయించారనే ప్రచారం నడుస్తోంది. ఖచ్చితంగా నివేదిత బరిలో ఉండదని.. బై పోల్‌ నుంచి తప్పుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నివేదిత మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు నివేదితను బీజేపీ సీనియర్లు బుజ్జగిస్తున్నారని సమాచారం. పలు రకాల హామీలతో ఆమెకు నచ్చజెబుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి నివేదిత నెక్స్ట్‌ స్టెప్ ఎంటన్నది సస్పెన్స్‌గా మారింది.

ఇవి కూడా చదవండి : TTD Plans: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమ‌ల‌లో ట్రాఫిక్‌ ప్రాబ్లమ్స్‌కి చెక్.. మ‌ల్టీలెవ‌ల్ కార్ పా‌ర్కింగ్‌ల ఏర్పాటు.. కొండపై ఎక్కడో తెలుసా..

Sultan of Multan: ముల్తాన్ కా సుల్తాన్‌.. పాకిస్తాన్‌కు చెప్పి మరీ కొట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు మూడు సెంచరీలు..

ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో బయటపడిన వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం.. రాక్షస రాజులే నిర్మించారా..?