వంద రోజుల్లో ఎన్నికలు..! తెలంగాణలో స్పీడ్‌ పెంచిన బీజేపీ.. నేతల సీరియస్‌ వర్క్‌..

|

Jul 22, 2023 | 8:51 PM

ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించే పనిలో హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. రాత్రి కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యనేతలకు జవదేకర్‌, బన్సల్‌ వివరించారు. ఆగస్ట్ 1 నుంచి ప్రజాక్షేత్రంలో ఉండాలని నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

వంద రోజుల్లో ఎన్నికలు..! తెలంగాణలో స్పీడ్‌ పెంచిన బీజేపీ.. నేతల సీరియస్‌ వర్క్‌..
BJP
Follow us on

ఇప్పటివరకూ ఒక ఎత్తు…ఇకపై మరో ఎత్తు. ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది తెలంగాణ బీజేపీ. కిషన్‌రెడ్డి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీ నేతలు కార్యాచరణను వేగవంతం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేడర్‌ ప్రజల్లోకి వెళ్లేలా నిన్న కోర్‌ కమిటి మీటింగ్‌లో చర్చించిన ఆ పార్టీ నేతలు..ఇవాళ బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌లో వందరోజుల కార్యాచరణకు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ బీజేపీ నేతలతో రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌లు ప్రకాశ్ జవదేకర్, సహా ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలపై నేతల అభిప్రాయలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్‌తో దోస్తీపై క్లారిటీ ఇవ్వాలని జవదేకర్, బన్సల్‌లను పలువురు నేతలు కోరారు. BRSతో బీజేపీకి ఎలాంటి అవగాహన లేదని జావదేకర్, బన్సల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో బీజేపీ నేతల మధ్య సమన్వయం కోసం హైకమాండ్‌ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు..కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ భవిష్యత్‌ కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించే పనిలో హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. రాత్రి కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యనేతలకు జవదేకర్‌, బన్సల్‌ వివరించారు. ఆగస్ట్ 1 నుంచి ప్రజాక్షేత్రంలో ఉండాలని నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు 22 కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మ్యానిఫెస్టో, చార్జ్ షీట్, మీడియా ప్రచార కమిటీ, పబ్లిక్ మీటింగ్స్ కమిటీ, టాకింగ్ పాయింట్స్ కమిటీ, స్టాటస్టిక్స్ కమిటీ, ఫీడ్ బ్యాక్ కమిటీ, అదర్ స్టేట్స్ కోఆర్డినేషన్ కమిటీ సహా.. 22కమిటీలు వేయాలని నిర్ణయించామన్నారు. వంద రోజుల్లో ఎన్నికల నేపథ్యంలో సీరియస్‌గా వర్క్ చేయాలని ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు నిన్న అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న కిషన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ పాలనను విమర్శించడంపై ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ను విమర్శించేముందు కిషన్‌రెడ్డి తన సొంతపార్టీలో అంతర్గత కుమ్ములాటలను సరిదిద్దుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి తెలంగాణపై అధిష్టానం ఫోకస్‌ పెట్టడంతో..బీజేపీ వర్క్‌ స్పీడప్‌ చేసింది. మరి ఈ స్పీడ్‌ కంటిన్యూగా కొనసాగుతుందా..? చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..