ఆ జిల్లాలో ఆఖరి నిమిషంలో నామినేషన్లను అడ్డుకున్న అధికార పార్టీ.. ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌

|

Feb 08, 2021 | 1:01 PM

ఏపీలో పంచాయతీ ఎన్నకల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో..

ఆ జిల్లాలో ఆఖరి నిమిషంలో నామినేషన్లను అడ్డుకున్న అధికార పార్టీ.. ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌
Follow us on

ఏపీలో పంచాయతీ ఎన్నకల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు నేడే ఆఖరు రోజు. రెండో విడత జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు కూడా నేడు ఆఖరు రోజు.

ఇక రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. జిల్లాలో 20 మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే గ్రామాలకు పోలింగ్ సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు. మూడో విడత నామినేషన్ల గడువుకు మరో కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు క్యూ కట్టారు.

ఈ నేపథ్యంలో చౌడేపల్లిలో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన బీజేపీ నేతలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారి తీసింది. చౌడేపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు చిన్న కిషోర్ భార్య రజిని నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

పంచాయతీ ఎన్నికల నేపత్యంలె అధికార పార్టీ నేతలు అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

Read more:

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి తప్పని వర్గపోరు. ఆ మంత్రి జిల్లాలో భగ్గుమన్న విభేదాలు

సంగీతానికి చింతకాయలు రాలవు.. ఉద్యోగంలో ఉంటావా.. పోతావా..? అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం