నా వల్ల నా అన్నకు సుఖం లేదు: పవన్ కళ్యాణ్

రాజమండ్రి: తనకు ఎంత ఆస్తులు ఉన్నా సుఖం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కూడా తన వల్ల సుఖం లేదని, తన అన్నకు కూడా తన వల్ల సుఖం లేదని అన్నారు. తనను కట్టుకున్నవాళ్లకు, తన బిడ్డలకు సుఖం లేదంటూ పవన్ భావేద్వేగంగా మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో పవన్ మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది స్వప్రయోజనాల కోసం కాదని, ఏదో సంపాదించుకుందామన్న ఉద్దేశం […]

నా వల్ల నా అన్నకు సుఖం లేదు: పవన్ కళ్యాణ్

Updated on: Mar 14, 2019 | 6:43 PM

రాజమండ్రి: తనకు ఎంత ఆస్తులు ఉన్నా సుఖం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కూడా తన వల్ల సుఖం లేదని, తన అన్నకు కూడా తన వల్ల సుఖం లేదని అన్నారు. తనను కట్టుకున్నవాళ్లకు, తన బిడ్డలకు సుఖం లేదంటూ పవన్ భావేద్వేగంగా మాట్లాడారు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో పవన్ మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది స్వప్రయోజనాల కోసం కాదని, ఏదో సంపాదించుకుందామన్న ఉద్దేశం లేనేలేదని చెప్పారు. తనకు జగన్ అన్నా, చంద్రబాబన్నా వ్యక్తిగత వైరం ఏమీలేదని స్పష్టం చేశారు.

Follow Us