సంచలనంగా మారిన శైలజానాథ్‌ శపథం.. రాహుల్‌.. ఆ పని చేయకుంటే ఆత్మార్పణ చేసుకుంటానన్న ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌

|

Feb 19, 2021 | 2:00 PM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పార్టీలకతీతంగా..

సంచలనంగా మారిన శైలజానాథ్‌ శపథం.. రాహుల్‌.. ఆ పని చేయకుంటే ఆత్మార్పణ చేసుకుంటానన్న ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌
Follow us on

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పార్టీలకతీతంగా నేతలు, కార్మికులు ఉద్యమబాట పట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ శైలజానాథ్‌ కామెంట్స్‌ సంచలనం రేపుతున్నాయి. రాహుల్‌ గాంధీ ప్రధాని అయిన గంటలోనే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తారని..ఒకవేళ రాకుంటే ఇదే గడ్డ మీద తాను ఆత్మార్పణకు చేసుకుంటాన్నని శపథం చేశారు శైలజానాథ్‌. అసలు కాంగ్రెస్‌కు ఉన్న బలమెంత..కేడర్‌ ఎంత. పీఎం పోస్ట్‌ ఎలా సాధిస్తారు..? ఇప్పటికే ఆ పార్టీ దేశవ్యాప్తంగా ఎదురీదుతోంది. ఇలాంటి సమయంలో శైలజానాథ్‌ చేసిన ఒక్క కామెంట్‌తో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదాంతో కార్మికుల ఆందోళన ఇప్పటికి కంటిన్యూ అవ్వుతోంది.. అలాంటిది ఇప్పుడు శైలజనాథ్‌ ఒక్క మాటతో గల్లీ మ్యాటర్‌ ఇప్పుడు ఢిల్లీ వరకు చేరింది.. అది కూడా పీఎం కుర్చీకి ఎసరు పెట్టేంతగా.. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం సభ ఏర్పాటైంది.. ఈ సభలో కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పెల్చారు. స్టేజ్‌మీద ప్రసంగిస్తోన్న శైలజనాథ్‌.. విజయసాయి విశాఖ వీధుల్లో పాదయాత్రలు చేస్తే ప్రయోజనం లేదని, ఢిల్లీ వెళ్లి ప్రధాని స్పందించేలా ఏదైనా చేయాలనడంతో స్టార్ట్‌ అయింది గొడవ. రాజకీయ ప్రయోజనాల కోసం యాత్రలు చేస్తున్నారంటూ విజయసాయిపై శైలజనాథ్‌ మాటల తూటా పెల్చారు.

రాహుల్‌, పంజాబ్‌, హర్యానా రైతుల గురించి ఎంపీ MVV మాట్లాడారు.. మరి విశాఖ ఉక్కుపై ఎందుకు మాట్లాడలేదని MVVని ప్రశ్నించడంతో పరిరక్షణ సభ కాస్త రాజకీయ సభలా మారిపోయింది.. అసలు మీరెం చేశారంటే.. మీరెం చెప్పారంటూ ఒకరిని ఒకరు చెడుగుడు ఆడేసుకున్నారు. ఇదే విషయమై ఫైర్‌ అయిన శైలజనాథ్‌ రాహుల్‌ పీఎం అయితే గంటలో ప్రత్యేక హోదా తెస్తారని రివర్స్‌ ఎటాక్‌ చేశారు. అక్కడితో ఆగారా..ఒకవేళ ప్రత్యేక హోదా తీసుకురాకపోతే తాను ఆత్మార్పణ చేసుకుంటా అంటూ శపథం కూడా చేయడం సంచలనంగా మారింది

అసలు కాంగ్రెస్‌ పార్టీకి సరిపడా బలం లేదు..బలగం లేదు. కేడర్ కూడా కొవ్వొత్తిలా కరిగిపోతోంది. ఇప్పటికే పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు క్లైమాక్స్‌ కార్డు పడేందుకు ముహూర్తం ఫిక్సైందని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి..ఇలాంటి టైంలో…మరి శైలజానాథన్న వ్యాఖ్యలు హాట్‌ టాఫిక్‌గా మారాయి. ఇప్పటికే పుదుచ్చేరి సీఎం బలపరీక్షకు వెళ్లీ రాహుల్‌ని బోల్తా కొట్టించారు. ఇక ఇప్పుడు శైలజనాథ్‌ కూడా ఆ క్యాటగిరిలోకే చేరిపోయారు. మరి బలం.. బలంగంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందా..? రాహుల్‌ పీఎం అవుతారా..? నిజంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తారా..? మరి కట్టలు తెంచుకున్న ఆవేశంతో శపథం చేసిన శైలజనాథ్‌ కామెంట్స్‌ ఆచరణలో నిరూపిస్తారా అంటే డౌటే మరీ.. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరు చెప్పలేం.

Read more:

ఏపీలో తెలంగాణ సీన్‌ రిపీట్‌.. నెల్లూరులో ప్రముఖ న్యాయవాదిపై గుర్తు తెలియని వ్యక్తుల హత్యాయత్నం..