NTR Political Entry: ఊపిరి ఊదవయ్యా.. రామయ్యా..!.. ఏపీలో హాట్ టాపిక్‌గా తారక్ పొలిటికల్ ఎంట్రీ..

|

Mar 30, 2021 | 8:29 AM

కొత్త ఊపిరి ఊదాలంటా... గెలవాలంటే...బలం కావాలంటా.. బలగం సమకూరాలంటా..కొత్త సమూహం రావాలంటా...అప్పుడు కానీ టీడీపీ జెండా రెపరెపలాడదంటా..

NTR Political Entry: ఊపిరి ఊదవయ్యా.. రామయ్యా..!.. ఏపీలో హాట్ టాపిక్‌గా తారక్ పొలిటికల్ ఎంట్రీ..
Follow us on

కొత్త ఊపిరి ఊదాలంటా… గెలవాలంటే…బలం కావాలంటా.. బలగం సమకూరాలంటా..కొత్త సమూహం రావాలంటా…అప్పుడు కానీ టీడీపీ జెండా రెపరెపలాడదంటా..గెలుపు గుర్రం ఎక్కలేరంటా..మునుపటి వైభవం రాదంటా… ఇది మేమంటున్న ముచ్చట కాదు…టీడీపీకి చెందిన సీనియర్ మోస్ట్ లీడర్ శ్రీ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సారు వారి మాట.

పార్టీ ఏర్పాటై 40ఏళ్లయిన సందర్భంగా తెలుగు తమ్ముళ్లంతా సంబరాలు చేసుకుంటున్న సమయాన టీడీపీ పెద్దాయన నోటి నుంచి వచ్చిన పలుకులివి. జూనియర్ ఎన్టీఆర్ రాగం మొదలైంది. రావాలి ఎన్టీఆర్..కావాలి ఎన్టీఆర్ అంటూ తెలుగు తమ్ముళ్లు నినదిస్తున్నారు. ఈ సెగ చంద్రబాబుకూ తగిలింది.

నాయకత్వం మారాలంటోంది సీనియర్ టీం. మరి సీనియర్స్ మాటకు అధినేత నుంచి మద్దతు ఉందా అన్నది పక్కపెడితే..ఇటు క్యాడర్ మాత్రం తమపని తాము చేసుకుపోతోంది. కుప్పంలో ప్లెక్సీల ఏర్పాటు నుంచి గోరంట్ల కామెంట్స్ వరకు ఎన్టీఆర్ గురించి చంద్రబాబుకు తెలియకుండానే జరుగుతున్నాయా…తెలిసే జరుగుతున్నాయా అన్నది టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు టీడీపీ ఇక రాష్ట్రంలో కోలుకోనివ్వని దెబ్బ కొట్టాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే టీడీపీకి బలం..బలగం పలుచనవుతోంది. టీడీపీలో కీలక నేతలపై పలు కేసుల్లో నిందితులుగా విచారణ ఎదుర్కొంటున్నారు. చాలా మంది టిడిపి నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లి దిక్కుతోచని స్థితిలో ఇబ్బంది పడుతున్నారని టాక్ . ఇక ఎటూ కాకుంటే…పక్కపార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇలాంటి టైంలో ముందుండి నడిపించే సరైన నాయకుడు ఒక్క జూనియర్ మాత్రమేనన్న టాక్ నడుస్తోంది. ఇక్కడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీ కార్యకర్తలతో పాటు నందమూరి కుటుంబ అభిమానుల బలమైన కోరిక. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడైతే ఇంకేముంది ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగేది. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పలు చోట్ల ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్లెక్సీలు వెలుస్తున్నాయ్.

మామూలుగా మాట్లాడుకుంటే..టీడీపీలో చంద్రబాబు తర్వాత బలమైన నాయకుడు ఎవరంటే…కటౌట్ చూడగానే..నాలుగు ఓట్లు ఎవరికి పడతాయంటే..అందరి వేళ్లు జూనియర్‌వైపే చూపిస్తున్నాయ్. అందుకే జూనియర్ రావాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే చంద్రబాబు-యంగ్‌టైగర్ మధ్య గ్యాప్ అలాగే ఉంది. మరి ఆ గ్యాప్ ఎవరు తగ్గిస్తారన్నదే కీలక పాయింట్. అయితే బాబాయ్‌ రాయబారం నడిపితే..జూనియర్ ఇట్టే కరిగిపోతారన్న ధీమా తెలుగు తమ్ముళ్లలో ఉంది. ఎందుకంటే..బాబాయ్ అంటే అబ్బాయ్‌కు అంత ప్రేమ ఉందన్న నమ్మకం. సో…ఇదంతా వచ్చే ఎన్నికల నాటికి జరిగుతుందా..అంటే జరగాలన్న కోరిక తెలుగుతమ్ముళ్లలో కనిపిస్తోంది. మరి చూడాలి..చంద్రబాబు జూనియర్‌కు స్పేస్ ఇస్తారా….లేక జూనియరే స్పేస్ తీసుకుంటారా..అన్నది.

Also Read: కరెంట్ షాక్ కొట్టి రామచిలుక మరణం.. ఉసూరుమన్న పక్షి ప్రేమికుడి మనసు.. ఏం చేశాడంటే..?

మట్టిలో మాణిక్యం మరోసారి మెరిసింది.. ఉసేన్ బోల్ట్‌ను దాటి ఎగసింది.. వారెవ్వా, శ్రీనివాసగౌడ