విశాఖ స్టీల్ ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల ఆలోచనను బీజేపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదా అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలు దేశంలో కాదా భాగం కాదా అని క్వశ్చన్ చేశారు. స్టీట్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్రం దిగొచ్చే దాకా పార్టీలకు అతీతంగా ఢిల్లీలో పోరాడుతామన్నారు. ఇందుకోసం కలిసొచ్చే పార్టీలను కలుపుకొని వెళ్తామని స్పష్టం చేశారు.
పరిశ్రమలు అన్నాక లాభాలు.. నష్టాలు కామన్. ఇప్పటికీ 6 వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని ప్రశ్నించారు మంత్రి అవంతి. ఇప్పటికే అనేక కష్టాల్లో ఉన్న ఏపీని మరిన్ని కష్టాల్లోకి నెడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలా వద్దా అన్న చర్చ ఇప్పుడు అప్రస్తుతమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ని ప్రైవేటీకరించొద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారన్నారు అవంతి. భారతదేశంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. తెలుగు ప్రజల మనోభావాలతో పన్లేదనుకుని కేంద్రం ముందుకెళ్తే… ప్రజలే బుద్ధి చెబుతారన్నారు అవంతి.
Read more:
లోటస్‌పాండ్‌లో అందరి చూపులు ఆ ఫ్లెక్సీల వైపే.. ఇంతకీ ఫ్లెక్సీలపై ఏం రాశారో తెలుసా..?
ఢిల్లీలో ఉంది మోడీనా.. కేడీనా.. కేంద్ర వ్యవసాయ చట్టాల గుట్టు విప్పిన సీఎల్పీ నేత భట్టీ