ఎన్నికల సెలవులపై ఏపీ ప్రభుత్వం ప్రకటన

ఎన్నికల సెలవులపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పోలింగ్‌కు ముందు రోజు(ఏప్రిల్10)తో పాటు ఓట్ల లెక్కింపు జరిగే మే 23న స్థానిక సెలవులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల […]

ఎన్నికల సెలవులపై ఏపీ ప్రభుత్వం ప్రకటన

Updated on: Apr 04, 2019 | 5:42 PM

ఎన్నికల సెలవులపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పోలింగ్‌కు ముందు రోజు(ఏప్రిల్10)తో పాటు ఓట్ల లెక్కింపు జరిగే మే 23న స్థానిక సెలవులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ వేగవంతం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us