ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన చంద్రబాబు

| Edited By:

Jan 18, 2020 | 12:33 PM

అమరావతిలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ ఘనంగా నిర్వహించింది. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో కళా వెంకట్రావ్‌, నారా లోకేష్‌, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు మహా నేత ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు. లక్షల మంది కార్యకర్తలు ఎన్టీఆర్‌ స్ఫూర్తితో […]

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన చంద్రబాబు
Follow us on

అమరావతిలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ ఘనంగా నిర్వహించింది. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో కళా వెంకట్రావ్‌, నారా లోకేష్‌, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు మహా నేత ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు. లక్షల మంది కార్యకర్తలు ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పనిచేస్తున్నారని కొనియాడారు. ఇప్పటి వరకూ సినిపరిశ్రమలో ఎన్టీఆర్‌లా ఎవరూ నటించలేరని అన్నారు.

కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్‌కు అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టుగా మారిందని ఆరోపించారు. దీనిపై ప్రజలు పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్తుందని మండిపడ్డారు. ఎన్ని త్యాగాలు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని.. అమరావతి రాజధానిని కదలనిచ్చేది లేదని అన్నారు చంద్రబాబు.