వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు.. టీడీపీ హయాంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారన్న మంత్రులు

|

Feb 26, 2021 | 5:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం రాకతో పేదల ఆరోగ్యానికి పెద్ద పేట వేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, ఆళ్ల నాని..

వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు.. టీడీపీ హయాంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారన్న మంత్రులు
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం రాకతో పేదల ఆరోగ్యానికి పెద్ద పేట వేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, ఆళ్ల నాని పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పేదల ఆరోగ్యాలను గాలికొదిలేసిందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలకు గడప ముంగిట వైద్యం అందించడానికి హాస్పిటల్స్ ను అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, ఆళ్ల నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నాడు నేడు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిల తరహాలో అభివృద్ధి చేస్తున్నారని మంత్రులు నారాయణస్వామి, ఆళ్ల నాని లు తెలిపారు..

ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వాణిజ్య, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పుష్ప గుచ్చం అందించి శాలువాతో సత్కరించి ఘనంగా ఆత్మీయంగా స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ లో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లాగ మారుస్తూ ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కి ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి నారాయణ స్వామి చెప్పారు..

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పెనుమూరు ప్రాంతంలో పది పడకల ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల వరకు అప్గ్రేడ్ చేశారని కార్వెడ్ నగర్ లో 10 పడకల ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తూ ఆదేశాలు ఇవ్వడం పట్ల నా నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి ఆళ్ల నాని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి నారాయణ స్వామి చెప్పారు. కరోనా సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్ని జిల్లాలలో పర్యటించి కరోనా నివారణకు కృషి చేశారని ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కావిడ్ హాస్పిటల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి బాధితులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకొని ప్రభుత్వపరంగా వారికి అన్నివిధాలుగా అండగా ఉన్న ఆళ్లనాని ప్రత్యేకంగా అభినందిస్తున్న మంత్రి నారాయణ స్వామి చెప్పారు..

ఎల్లవేళలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దీవెనలు ఎప్పుడు గంగాధర నెల్లూరు నియోజకవర్గం పై ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి నారాయణ స్వామి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి, వైయస్సార్ సిపి నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎం ఆర్ డి బలరాం, పిల్లంగోల్ల శ్రీలక్ష్మి, మంచం మై బాబు, బుద్ధుని శ్రీనివాస్, నెరుసు చిరంజీవి, మునుల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, నవ హర్ష తదితర వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు..

Read more:

ఆ ఎమ్మెల్యేకు పవన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. తమకు రెండో చెంప చూపించే సంయమనం లేదన్న జనసేన అధినేత