AP CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతి పర్యటన.. ఏ ఏ కార్యక్రమాలకు హాజరవుతారంటే..

|

Feb 17, 2021 | 2:09 PM

AP CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతి పర్యటన చేయనున్నారు. తిరుపతి వైట్‌హౌస్‌లో జరిగే మాజీ సైనికుల సన్మాన

AP CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతి పర్యటన..  ఏ ఏ కార్యక్రమాలకు హాజరవుతారంటే..
Follow us on

AP CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతి పర్యటన చేయనున్నారు. తిరుపతి వైట్‌హౌస్‌లో జరిగే మాజీ సైనికుల సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 18 న గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి గన్నవరం నుంచి బయల్దేరి సాయంత్రం 4.30 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం సా. 4.50 గం. లకు తిరుపతి లోని వైట్ హౌస్ మెయిన్ ఫంక్షన్ హాల్ కు చేరుకుని రిటైర్ మేజర్ జనరల్ శ్రీ సి.వి వేణుగోపాల్ సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తారు. తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 7.10 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం బయల్దేరి వెళతారు. ముఖ్యమంత్రి పర్యటనతో తిరుపతి పోలీస్ యంత్రాగం అప్రమత్తమైంది. కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం సీఎం జగన్ విశాఖ పట్నంలో పర్యటిస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠానికి చేరుకొని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్నారు.

ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి..

AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికలు.. వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతల ఆందోళన