మీడియాలో, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవాలను కప్పిపుచ్చి, అసత్య ప్రచారాలు చేస్తే ఇకపై చెల్లదని సీఎం జగన్ హెచ్చరించారు. దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఏపీ ప్రభుత్వం తరఫున ‘ఏపీ ఫ్యాక్ట్‌చెక్’వేదికను ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్, ట్విట్టర్ అకౌంట్‌ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ మీడియాలో, సోషల్ మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికలుగా ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పారు. నడుస్తున్న ప్రచారం ఎలా తప్పో సాక్షాధారాలతో ఎపీ ఫ్యాక్ట్‌చెక్ చూపిస్తుందని సీఎం జగన్ అన్నారు. అసలు నిజమేంటో, నడుతస్తున్న అబద్ధపు ప్రచారం ఏంటో చూపిస్తారని తెలిపారు. ఏపీ ఫ్యాక్ట్‌చెక్ ముఖ్య ఉద్దేశం ఇదేనన్నారు.
దురుద్దేశపూర్వకం చేసే ప్రచారం మీద అధికారులు కూడా చర్యలు తీసుకుంటారని సీఎం జగన్ తెలిపారు. దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారం మొదట ఎక్కడనుంచి మొదలయ్యిందో దాన్ని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒక వ్యక్తి ప్రతిష్టను, ఒక వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదన్నారు జగన్.
వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టుపట్టించే హక్కు ఎవ్వరికీ లేదన్నారు సీఎం జగన్. వ్యవస్థలను తప్పుదోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారు. వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి ఎక్కడోచోట ముగింపు పలకాలని సీఎం జగన్ అన్నారు. వెబ్ సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీస్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.
ఫేక్ న్యూస్‌పై ఫ్యాక్ట్ చెక్https://t.co/TKwDpJzcCo #FactCheckAP
— YSR Congress Party (@YSRCParty) March 5, 2021
ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
-ఫేక్ న్యూస్‌కు చెక్ పెడుతూ.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేలా పోర్టల్ రూపకల్పన
-సంస్థలు, మతాలు, కులాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించపరిచేలా పోస్టింగ్‌లు పెడితే చట్టపరమైన చర్యలు#FactCheckAP pic.twitter.com/Kcz3ZziRHy— YSR Congress Party (@YSRCParty) March 5, 2021
Read More:
ఆ జిల్లాలో సీన్ రివర్స్.. మున్సిపల్ ఎన్నికల్లో తలకిందులవుతున్న పార్టీల బలాబలాలు
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపుతో స్తంభించిన ఏపీ.. ఏపీ బంద్‌కు అఖిలపక్షాల సంఘీభావం