సీఎం జగన్‌తో విశాఖ స్టీల్‌ కార్మికుల భేటీ.. కార్మిక సంఘాలకు ఇచ్చిన ఆ కీలక హామీ ఏంటో తెలుసా..?

|

Feb 17, 2021 | 4:43 PM

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అఖిలపక్ష..

సీఎం జగన్‌తో విశాఖ స్టీల్‌ కార్మికుల భేటీ.. కార్మిక సంఘాలకు ఇచ్చిన ఆ  కీలక హామీ ఏంటో తెలుసా..?
Follow us on

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో విశాఖ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ను కార్యిక సంఘాల నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్మికులకు సీఎం జగన్‌ కీలక హామీలిచ్చినట్టు కార్మిక సంఘాల నేతలు చెప్పారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కార్మికులకు హామీనిచ్చారు సీఎం జగన్‌. తనను కలిసిన 14 కార్మిక సంఘాల నేతలతో గంటకు పైగా మాట్లాడారు. ప్రభుత్వం కూడా కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం జగన్‌తో చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు స్టీల్‌ ప్లాంట్‌ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్య రాము.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయ్యే అవకాశాలు లేవని ముఖ్యమంత్రి జగన్ తమతో అన్నారని ప్లాంట్ కు చెందిన కార్మిక సంఘాల నేతలు తెలిపారు. విశాఖకు వెళ్లిన జగన్ ను నేతలు ఎయిర్ పోర్టులో కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సీఎంతో చర్చించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. కార్మిక నేతలు తమ వినతి పత్రాన్ని జగన్ కు అందించారు.

దేవుడి ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వం మనసు మారుతుందని భావిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారని కార్మిక నేతలన్నారు. పోస్కో సంస్థను విశాఖలో అడుగుపెట్టనివ్వనని హామీ ఇచ్చినట్లు చెప్పారు. పోస్కో సంస్థతో కడప, భావనపాడు, కృష్ణపట్నంలో పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని సీఎంకు కార్మిక నేతలు తెలిపారు.

Read more:

ఆంధ్రప్రదేశ్‌లో వెలసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ భారీ ఫ్లెక్సీలు.. అభిమానానికి హద్దులు లేవని నిరూపించిన ఏపీ ప్రజలు