
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన సభాహక్కుల ఫిర్యాదుపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఆన్‌లైన్ ద్వారా జరిగే ఈ సమావేశంలో మంత్రుల ఫిర్యాదును విచారించి నిమ్మగడ్డకు నోటీసు పంపే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. SEC నిమ్మగడ్డ మీద మంత్రుల ఇచ్చిన ఫిర్యాదుపై అసెంబ్లీ స్పీకర్ రూల్ 173 కింద ప్రివిలేజ్ కమిటీకి రిఫరల్ చేశారని కమిటీ సభ్యుడు మల్లాది విష్ణు టీవీ9తో తెలిపారు. 2006లోమహారాష్ట్ర లో అక్కడి SEC పై ప్రివిలేజ్ కమిటీ ఇదే విధంగా చర్యలు తీసుకుందని ఆయన వివరించారు.