Alla Ramakrishna Reddy: ఎన్నికల బహిష్కరణ నిజమైతే ఇలా చేయండి.. చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ఛాలెంజ్

|

Sep 21, 2021 | 12:46 PM

ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను టీడీపీ బహిష్కరించినట్లు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం విడ్డూరమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఎద్దేవా చేశారు.

Alla Ramakrishna Reddy: ఎన్నికల బహిష్కరణ నిజమైతే ఇలా చేయండి.. చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ఛాలెంజ్
Mangalagiri MLA Alla Ramakrishna Reddy
Follow us on

ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను టీడీపీ బహిష్కరించినట్లు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం విడ్డూరమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రకమైన ప్రచారంతో చంద్రబాబు నాయుడు కొత్త రాజకీయ డ్రామాకు తెరతీశారని ధ్వజమెత్తారు. ఓవైపు ఎలక్షన్ బహిష్కరించామని అంటూనే.. తమ పార్టీ అభ్యర్థులకు బిఫారాలు ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా తన వాళ్లతో కోర్టులో కేసు వేయించి..ఎన్నికలను, ఎన్నికల ఫలితాలు రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు విఫలయత్నాం చేశారని ఆరోపించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు బహిష్కరించినట్లు చెబుతున్న చంద్రబాబు నాయుడు.. తమ పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను వెనక్కి తీసుకుంటారా? అని సూటిగా ప్రశ్నించారు. నిజంగానే ఎన్నికలను టీడీపీ బహిష్కరించి ఉంటే చంద్రబాబు అలా చేయాలంటూ సవాలు విసిరారు.

మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే ఆళ్ల ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాదులో నారా లోకేష్ ఉండి వైసిపి పార్టీ ఎంపీటీసీ సభ్యులు కొనుగోలు చేయడానికి విశ్వప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎంపీటీసీలు తమ వైపు వస్తామని సంకేతాలు పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఎన్నికలు జరిగిన ఐదు మాసాల తర్వాత ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఆదివారంనాడు చేపట్టడం తెలిసిందే. అధికార వైసీపీకి పట్టంకడుతూ 13 జిల్లాల ప్రజలు తీర్పు ఇచ్చారు. కొన్ని చోట్ల మాత్రం వైసీపీకి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చాయి. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలోనూ ఎమ్మెల్యే ఆర్కేకి షాక్ తగిలింది. అక్కడ టీడీపీ 9 ఎంపీటీసీలు, వైసీపీ 8, జనసేన 1 ఎంపీటీసీ గెలుచుకున్నాయి. ఈ  నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుర్గిరాలలో ఎంపీపీని వైసీపీ సొంతం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తంచేస్తున్నారు.

Also Read..

Tiruamala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్వామివారి ఉచిత దర్శనం షురూ.. దర్శన సమయం పెంపు

Bigg Boss 5 Telugu: ప్రియా వ్యాఖ్యల కలకలం.. బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న ఎడమొఖం- పెడమొఖం..