Somu Veerraju : సొంత ఆస్తులను సీఎం జగన్ ఎందుకు తాకట్టు పెట్టడంలేదు..? ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

|

Jun 22, 2021 | 5:08 PM

దేశంలోనే ఇలాంటి పాలనను ఎక్కడా చూడటం లేదంటూ జగన్ సర్కారుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. జగన్ విడుదల చేసిన క్యాలెండర్ రాష్ట్రంలో దుమారం రేపిందన్న ఆయన..

Somu Veerraju : సొంత ఆస్తులను సీఎం జగన్ ఎందుకు తాకట్టు పెట్టడంలేదు..?  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
Somu Veerraju
Follow us on

BJP AP President : దేశంలోనే ఇలాంటి పాలనను ఎక్కడా చూడటం లేదంటూ జగన్ సర్కారుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. జగన్ విడుదల చేసిన క్యాలెండర్ రాష్ట్రంలో దుమారం రేపిందన్న ఆయన, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు కానుకలు ఇవ్వడం, అప్పులు చేయడమే పాలనగా ఉందన్నారు. సొంత ఆస్తులను జగన్ ఎందుకు తాకట్టు పెట్టడం లేదని సోము నిలదీశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని, అన్ని చోట్ల నిరసనలు తెలుపుతున్నారని వీర్రాజు చెప్పుకొచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని… రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ ఖండిస్తోందని వ్యాఖ్యానించారు.

కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రంలో ఉపాధి వస్తుందంటే.. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని సోము వీర్రాజు విమర్శించారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారని.. సొంత ఆస్తులను జగన్ ఎందుకు తాకట్టు పెట్టడం లేదన్నారు. అశోక్ గజపతిరాజు కుటుంబం ఎన్నో దానధర్మాలు చేసిందని… అలాంటి అశోక్ రాజును విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదని వీర్రాజు మండిపడ్డారు.

అశోక్ గజపతిరాజు.. అలాంటి వ్యక్తులపై విమర్శలు చేసేముందు వైసీపీ నేతలు వారి స్థాయిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అస్తవ్యస్థమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు. విశాఖలో కొనసాగుతున్న భూకబ్జాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు.

Read also : CM KCR : గ్రామ మహిళలకు స్వయంగా వంటకాలను వడ్డించిన సీఎం కేసీఆర్, వాసాలమర్రిలో పెద్ద పండుగ శోభ