ముఖ్యమంత్రికి అధికారాల్లేవా?: సీఎస్‌కు చంద్రబాబు లేఖ

| Edited By:

Apr 27, 2019 | 9:42 AM

ఈసీ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. ఒక ఆంగ్ల పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైన ఆ వార్తా కథనాన్ని కూడా తన లేఖకు జత చేశారు. ‘‘ఒక ముఖ్యమంత్రి పట్ల మీరు వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. అఖిల భారత సర్వీసు అధికారుల ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించినట్లుగా ఉంది. మీరు హోదా, గౌరవాన్ని పాటించలేదు. ఈ వార్తలో […]

ముఖ్యమంత్రికి అధికారాల్లేవా?: సీఎస్‌కు చంద్రబాబు లేఖ
Follow us on

ఈసీ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. ఒక ఆంగ్ల పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైన ఆ వార్తా కథనాన్ని కూడా తన లేఖకు జత చేశారు. ‘‘ఒక ముఖ్యమంత్రి పట్ల మీరు వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. అఖిల భారత సర్వీసు అధికారుల ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించినట్లుగా ఉంది. మీరు హోదా, గౌరవాన్ని పాటించలేదు. ఈ వార్తలో ప్రచురితమైనట్లుగా ఉన్న వ్యాఖ్యలు మీరు చేశారా! దీనిపై మీ వివరణ ఏమిటి?’’ అని ఎల్వీ సుబ్రమణ్యంను ముఖ్యమంత్రి చంద్రబాబు తన లేఖలో ప్రశ్నించారు. సీఎస్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని కొందరు సీనియర్‌ మంత్రులు, అధికారులు అభిప్రాయపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి వద్ద కూడా కొంత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్వీని వివరణ కోరుతూ ముఖ్యమంత్రి లేఖ రాశారు.

ఎల్వీ తన పరిధిని అతిక్రమించారన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో నేరుగా ఆయనకు దీనిపై లేఖ రాయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రధాన కార్యదర్శిని సంజాయిషీ కోరుతున్నట్లు కాకుండా వివరణ కోరుతున్నట్లుగా రాసినట్లు సమాచారం.