అమిత్ షా ఏపీ పర్యటన ఖరారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షా ఏపీకి రానున్నారు. ఈ నెల 4న విశాఖపట్టణంకు రాబోతున్న అమిత్ షా.. అక్కడ రోడ్‌షోలో పాల్గొననున్నారు. దీనిపై ఏపీ బీజేపీ నేతలు స్పష్టతను ఇచ్చారు. విశాఖపట్టణం నుంచి అసెంబ్లీ, లోక్‌సభకు పోటీ చేయనున్న అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలో మర్రిపాలెం, కంచరపాలెం మెట్ట తదితర ప్రాంతాలలో అమిత్ షా రోడ్‌ షోలు ఉండనున్నాయని పార్టీ నేతలు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి […]

అమిత్ షా ఏపీ పర్యటన ఖరారు

Edited By:

Updated on: Apr 02, 2019 | 3:03 PM

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షా ఏపీకి రానున్నారు. ఈ నెల 4న విశాఖపట్టణంకు రాబోతున్న అమిత్ షా.. అక్కడ రోడ్‌షోలో పాల్గొననున్నారు. దీనిపై ఏపీ బీజేపీ నేతలు స్పష్టతను ఇచ్చారు. విశాఖపట్టణం నుంచి అసెంబ్లీ, లోక్‌సభకు పోటీ చేయనున్న అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలో మర్రిపాలెం, కంచరపాలెం మెట్ట తదితర ప్రాంతాలలో అమిత్ షా రోడ్‌ షోలు ఉండనున్నాయని పార్టీ నేతలు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని వారు వెల్లడించారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మొదటిసారిగా అమిత్ షా రాష్ట్రానికి వస్తుండగా.. ఆయన పర్యటనపై బీజేపీ నేతలు భార అంచనాలు పెట్టుకున్నారు.